Asianet News TeluguAsianet News Telugu

ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్: హర్యానాలో కట్టర్ కే మళ్లీ పట్టాభిషేకం, బీజేపీ ధూంధాం

ఈ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించనుందని తెలిపింది. 66 స్థానాల్లో గెలుపొంది మళ్లీ అధికారంలోకి రానుందని తెలిపింది. 66 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించడమేకాకుండా మళ్లీ అధికారంలోకి రానుంది బీజేపీ. 

haryan ndtv exit polls:war one side, bjp win
Author
Haryana, First Published Oct 21, 2019, 7:36 PM IST

హర్యానా: హర్యానా రాష్ట్ర ప్రజలు మళ్లీ కట్టర్ కే పట్టం కట్టనున్నట్లు ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ లో తెలిపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించనుందని తెలిపింది. 66 స్థానాల్లో గెలుపొంది మళ్లీ అధికారంలోకి రానుందని తెలిపింది. 

66 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించడమేకాకుండా మళ్లీ అధికారంలోకి రానుంది బీజేపీ. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ 14స్థానాలకే పరిమితం కానుందని ఎగ్జిట్ పోల్స్ లో తెలిపింది. ఇకపోతే ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. 

బీజేపీ-66
కాంగ్రెస్- 14 
ఇతరులు-10

Read more #exitpoll: హర్యానాలో రెండోసారి అధికారం బీజేపీదే ..ఏబీపీ సి ఓటర్ సర్వే...
రాష్ట్రంలో పార్టీ నేతృత్వం మారిన తరువాత హర్యానాలో కాంగ్రెస్ ఎలాగైనా తన పూర్వ వైభవాన్ని సాధించి తీరుతామని నమ్మకంగా ఉన్నారు. మరోవైపేమో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి తీరుతామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఉన్న 90 సీట్లలో ఎలాగైనా 75 సీట్లు గెలవాల్సిందే అని టార్గెట్ ఫిక్స్ చేసారు. 

ప్రస్తుతం ఉన్న 90 సీట్లలో బీజేపీకి 48 సీట్లున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న 10 స్థానాలకు 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దుశ్యంత్ చౌతాలా నాయకత్వంలోని జన నాయక్ జనతా పార్టీ కూడా తన భవితవ్యాన్ని మార్చుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నం చేస్తుంది. 

Read more at Exit polls 2019: మహారాష్ట్ర, హర్యానాల్లో వార్ వన్‌సైడ్...

చౌతాలా కుటుంబంలో వచ్చిన మనస్పర్థల వల్ల దుశ్యంత్ చౌతాలా గత డిసెంబర్ లో ఐఎన్ ఎల్డి నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న విషయం తెల్;ఇసిందే. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా విఫలమయ్యింది. 

బీఎస్పీ, ఆప్,ఎల్ఎస్పీ, సహా చాల పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాకపోతే వీరెవరూ అన్ని సీట్లలోనూ పోటీ చేయడం లేదు. బీజేపీ ఈ సరి ముగ్గురు క్రీడాకారులకు హర్యానాలో టిక్కెట్లు ఇచ్చింది. 

Read more #ExitPolls న్యూస్ ఎక్స్ సర్వే: ఖట్టర్‌ కమ్ ఎగైన్...

బబిత ఫోగట్, యోగేశ్వర్ దత్, సందీప్ సింగ్. సందీప్ సింగ్ హాకీ క్రీడాకారుడు కాగా, మిగిలిన ఇద్దరు కుస్తీ యోధులు. 2014లో బీజేపీ తొలిసారిగా హర్యానాలో అధికారం చేపట్టింది. 47 సీట్లలో గెలవడం ద్వారా బీజేపీ అధికారం చేజిక్కించుకోగలిగింది. 

ఈ సంవత్సరామారంభంలో జరిగిన జింద్ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా తన కౌంట్ ను 48కి తీసుకెళ్లింది. ఐఎన్ఎల్డి  కి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ కు 17మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలకు చెరో ఎమ్మెల్యే ఉన్నారు. ఇంకో 5గురు స్వతంత్రులు 2014లో విజయం సాధించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios