Asianet News TeluguAsianet News Telugu

ఐదుగురితో పెళ్లి.. మరో 21మందిని లైన్లో పెట్టాడు..

అప్పటికే ఐదుగురిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా..మరో 21మందిని  పెళ్లి చేసుకోవడానికి లైన్లో పెట్టాడు. 

haridwar police held man who marriages five women
Author
Hyderabad, First Published Dec 24, 2018, 12:55 PM IST


అప్పటికే ఐదుగురిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా..మరో 21మందిని  పెళ్లి చేసుకోవడానికి లైన్లో పెట్టాడు. చివరకు.. పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హర్యానాకు చెందిన అభిషేక్ వశిష్ట్ అలియాస్ అభివన్ అభిరుద్రాంశ్ ఇప్పటి వరకు ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు.  భర్తతో విడిపోయిన మహిళల వివరాలను సేకరించి.. వారితో స్నేహం చేస్తాడు. వారితో తాను ఒక మీడియా హౌస్ ఓనర్ అని నమ్మించి వివాహం చేసుకుంటాడు.

కాగా ఢిల్లీలోని బారాఖంబా పోలీసుస్టేషన్లో ఒక యువతి అభిషేక్‌పై ఫి‌ర్యాదు చేసింది. ఈ కేసులో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు హరిద్వార్‌లో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారితో లివ్‌ ఇన్ రిలేషన్‌లో ఉంటున్నాడు. 

అదేవిధంగా మాట్రిమోనియల్ సైట్లలో నకిలీ పేర్లతో పెళ్లి కోసం సంప్రదింపులు జరుపుతుంటాడని వెల్లడైంది. 2002లో నిందితుడు కవిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది. తరువాత వారిని వదిలివేసి, 2012లో జ్యోతిష్యునిగా వేషం వేసుకుని. మోసాలకు పాల్పడేవాడు. ఈ వ్యవహారం బయటపడటంతో తిరిగి వేషం మార్చివేశాడు. 

బాధిత మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని హరిద్వార్ లో పట్టుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios