Asianet News TeluguAsianet News Telugu

కేజ్రీవాల్ దగ్గర నిజంగానే డబ్బులు లేవనుకున్నా...కానీ: గౌతమ్ గంభీర్ సెటైర్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు ప్రచారం పేరుతో చేస్తున్న హంగామాను టీంఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టారు. మరీ ముఖ్యంగా సామాన్యుడి పార్టీగా చెప్పుకునే డిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ కూడా భారీ ఎత్తున న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇస్తూ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోందని గంభీర్ ఆరోపించారు. ఈ దుబారా ఖర్చుపై డిల్లీ సీఎం కేజ్రీవాల్ నుండి గంభీర్ వివరణ కోరారు.  

farmer cricketer gautam gambhir fires on aam aadmi party ads
Author
New Delhi, First Published Feb 23, 2019, 3:54 PM IST

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు ప్రచారం పేరుతో చేస్తున్న హంగామాను టీంఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టారు. మరీ ముఖ్యంగా సామాన్యుడి పార్టీగా చెప్పుకునే డిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ కూడా భారీ ఎత్తున న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇస్తూ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోందని గంభీర్ ఆరోపించారు. ఈ దుబారా ఖర్చుపై డిల్లీ సీఎం కేజ్రీవాల్ నుండి గంభీర్ వివరణ కోరారు.  

ఇవాళ వివిధ దిన పత్రికలలో ఆమ్ ఆద్మీ పార్టీ, డిల్లీ  ప్రభుత్వానికి సంబంధించి చాలా యాడ్స్ వచ్చాయి. దీంతో ఆ యాడ్స్ కు సంబంధించిన ఫోటోలను గంభీర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. '' ఇవాళ డిల్లీ న్యూస్ పేపర్లు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ యాడ్స్ తో నిండిపోయాయి.  వాటిని చూస్తే మాల్ ఆఫ్ కేజ్రీవాల్ మాదిరిగా అనిపించాయి. ఈ యాడ్స్ కోసం వెచ్చించిన డబ్బులు డిల్లీ ప్రజలకు చెందినవి కావా...? తన ప్రశ్నకు సీఎం కార్యాలయానికి చెందినవారు గానీ లేదా ఆమ్ ఆద్మీ  పార్టీకి చెందిన నాయకులు గానీ వివరణ ఇవ్వగలరా? ఇంకా మేమంతా డిల్లీ సీఎం కేజ్రీవాల్ వద్ద ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేవని అనుకుంటున్నాం...'' అంటూ గంభీర్ ఆ ఫోటోలకు కామెంట్ యాడ్ చేశారు. 

అలాగే జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ లు కూడా ప్రజల సొమ్ముతో కాకుండా తమ సొంత డబ్బులనే ఎన్నికల ప్రచారానికి ఉపయోగించాలని గంభీర్ సూచించారు. ప్రభుత్వం వద్దగల ప్రజల డబ్బులను కేవలం అభివృద్ది పనులకు, పేదల సంక్షేమం కోసమే ఉపయోగించాలంటూ గంభీర్ మరో ట్వీట్ ద్వారా ఇతర పార్టీలకు కూడా చురకలు అంటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios