Asianet News TeluguAsianet News Telugu

బాలుడి గొంతులో మేకు.. ఆపరేషన్ చేసి బయటకు తీశారు

నాలుగేళ్ల బాలుడి గొంతులో మేకు ఇరుక్కుపోగా.. శస్త్రచికిత్స చేసి వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సూరత్ లో చోటుచేసుకుంది. 

exposed in the throats of the child, spent one lakh in Maharashtra, was removed in Surat at 60 rupees
Author
Hyderabad, First Published Apr 13, 2019, 8:06 AM IST


నాలుగేళ్ల బాలుడి గొంతులో మేకు ఇరుక్కుపోగా.. శస్త్రచికిత్స చేసి వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సూరత్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రకు చెందిన దంపతులకు ప్రథమేష్(4) అనే కుమారుడు ఉన్నాడు. బాలుడి గొంతులో ప్రమాదశాత్తు మేకు ఇరుక్కుంది. కాగా దానిని వెలికి తీసేందుకు అక్కడి వైద్యులు రూ.లక్ష ఖర్చు అవుతుందని చెప్పారు. అంత చెల్లించే స్థోమత లేక బాలుని తల్లిదండ్రులు బంధువు సూచనల మేరకు కుమారుడిని సూరత్ తీసుకువచ్చాడు. 

అక్కడి సివిల్ ఆసుపత్రి వైద్యులకు కుమారుడిని చూపించాడు. వారు మరోమారు ఎక్స్‌రే తీసి, ప్రత్యేక టెలిస్కోపీ విధానంలో ఆ మేకును 3 నిముషాల వ్యవధిలో వెలికి తీశారు. ఇందుకు కేస్ పేపర్‌కు రూ. 10, ఎక్స్‌రే కోసం రూ. 50 ఖర్చయ్యాయి. బాలుడు ప్రాణాలతో క్షేమంగా బయటపడటంతో.. బాలుడి తల్లిదండ్రులు వైద్యులకు దన్యవాదాలు తెలియజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios