Asianet News TeluguAsianet News Telugu

ఈశాన్యభారత్ లో భూకంపం: పరుగులుతీసిన ప్రజలు

భూ ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు. అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

Earthquake in northeast India
Author
Delhi, First Published Apr 24, 2019, 8:52 AM IST

ఢిల్లీ‌: ఈశాన్య భారత్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు స్పష్టం చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలలో అర్థరాత్రి భూకంపం సంభవించింది. 

భూ ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు. అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

అయితే ఈశాన్య భారత్ లో భూకంపం ధాటికి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ కు సరిహద్దులో ఉన్న మయన్మార్, భూటాన్ లలో కూడా భూమి కంపించినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios