Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య కేసు:' అక్టోబర్ 18 నాటికి వాదనలు పూర్తి కావాల్సిందే'

అయోధ్య కేసులో వాదనలను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇరు పక్షాల న్యాయవాదులను కోరింది. 

CJI Ranjan Gogoi insists Ayodhya dispute hearing should end by October 18, says we have 10.5 days
Author
New Delhi, First Published Sep 26, 2019, 1:49 PM IST

న్యూఢిల్లీ: అయోధ్య కేసులో ఇరుపక్షాల వాదనలను ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు.అయోధ్య భూ వివాదం కేసు విషయమై గురువారం నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్  ఈ మేరకు ఇరు పక్షాల న్యాయవాదులకు సూచించారు.

ఈ ఏడాది నవంబర్ మాసంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవి కాలం ముగియనుంది. అయితే తన పదవీకాలం ముగిసేలోపుగానే ఈ కేసుపై తీర్పు వెలువడితే నాలుగు వారాల్లో ఈ కేసుకు సంబంధించిన నిర్ణయం వెలువరించి రికార్డు  సృష్టించనుంది.

అక్టోబర్ 18వ తేదీ నాటికి ఇరు పక్షాల వాదనలు  పూర్తి చేయాలంటే దీపావళి సెలవుల్లో కూడ కోర్టు వాదనలను వినే అవకాశం లేకపోలేదు.శనివారాల్లో ఎక్కువ సమయం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు పనిచేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను వింటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios