Asianet News TeluguAsianet News Telugu

చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్: సాయంత్రం మోదీతో భేటీ

భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. జిన్ పింగ్ కు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిలు ఘన స్వాగతం పలికారు. 

china president jinping reached chennai international airport
Author
chennai, First Published Oct 11, 2019, 2:28 PM IST

తమిళనాడు: భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. జిన్ పింగ్ కు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిలు ఘన స్వాగతం పలికారు. 

సుమారు 500 మంది డప్పు కళాకారులతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఘన స్వాగతం పలికారు. ఇకపోతే సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ జిన్ పింగ్ తో భేటీ కానున్నారు. శోర్ ఆలయ ప్రాంగణంలో ఇద్దరు ప్రధానిలు భేటీ కానున్నారు. 

అనంతరం శనివారం ఇరుదేశాల ప్రధానిలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. చైనా-భారత్ ల మధ్య సత్సమ సంబంధాలు మెరుగుపరిచేందుకు ఈ భేటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ద్వైపాక్షిక చర్చలకు వేదికలుగా చారిత్రక కట్టడాలు నిలవబోతున్నాయి. 

ఇప్పటికే భారత ప్రధాని నరేంద్రమోదీ మహాబలిపురానికి చేరుకున్నారు. మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామితోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సాయంత్రం 4 గంటలకు మోదీ భేటీ కానున్నారు. 

శోర్ ఆలయంలోని చారిత్రక కట్టడాలను మోదీ జిన్ పింగ్ కు  స్వయంగా వివరించనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే గైడ్ ను సైతం ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. 

 

Follow Us:
Download App:
  • android
  • ios