Asianet News TeluguAsianet News Telugu

రాహుల్‌తో చంద్రబాబు భేటీ: తెలంగాణ సర్ధుబాట్లపైనా చర్చ

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం నాడు మధ్యాహ్నం  సమావేశమయ్యారు.

Chandrababunaidu meets congress chief rahul gandhi
Author
New Delhi, First Published Nov 1, 2018, 3:41 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం నాడు మధ్యాహ్నం  సమావేశమయ్యారు.

 

దేశంలో బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుతో పాటు తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్‌తో చంద్రబాబునాయుడు చర్చిస్తున్నారు.బీజేపీయేతర పార్టీల కూటమి ఏర్పాటు విషయంలో  కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని  టీడీపీ భావిస్తోంది.

రాహుల్‌తో సమావేశంలో టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్,  టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు,, కాంగ్రెస్ పార్టీ తరపున  కొప్పుల రాజు,  అహ్మద్ పటేల్ కూడ ఉన్నారు.

 

ఈ సమావేశంలో  తెలంగాణ  ఎన్నికల గురించి చర్చించనున్నారు. బీజేపీయేతర పార్టీలతో కూటమి ఏర్పాటు విషయంలో ఇతర పార్టీలతో చర్చించే  విషయాన్ని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు  శరద్ పవార్‌ అప్పగించారు.  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ తో చర్చల సందర్భంగా బీజేపీయేతర పార్టీలతో  కూటమి ఏర్పాటుపై  ప్రధానంగా చర్చ ఉంటుందని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

గురువారం నాడు తన ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  మీడియాకు వివరించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

సేవ్ నేషన్ పోరు జోరు: పవార్, ఫరూక్ లతో బాబు భేటీ

బీజేపీయేతర ఫ్రంట్‌‌ వైపు బాబు అడుగులు: 20 ఏళ్ల తర్వాత

రాహుల్ గాంధీని కలుస్తా,జాతీయ పార్టీలను ఏకం చేస్తా:చంద్రబాబు

నాడు రాష్ట్రపతి పీఠం, రేపు ప్రధాని పీఠం ఇదే బాబు తారకమంత్రం

రాహుల్‌తో నేడు భేటీ: యూపీఏలోకి చంద్రబాబు

Follow Us:
Download App:
  • android
  • ios