Asianet News TeluguAsianet News Telugu

ఇదీ కారణం: రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు

బుందేల్ ఖండ్‌కు చెందిన ఓ పేద రైతుకు  రాత్రికి రాత్రే  అదృష్టం వరించింది. 

Bundelkhand labourer stumbles upon diamond valued at Rs 1.5 crore
Author
Bundelkhand, First Published Oct 10, 2018, 3:32 PM IST


బుందేల్ ఖండ్: బుందేల్ ఖండ్‌కు చెందిన ఓ పేద రైతుకు  రాత్రికి రాత్రే  అదృష్టం వరించింది. తరాల నుండి మైనింగ్ వ్యాపారం చేస్తున్న ఆ కుటుంబానికి  ఎట్టకేలకు  వజ్రం రూపంలో  అదృష్టం కలిసొచ్చింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన మోతీలాల్ ప్రజాపతి  కుటుంబం తరాలుగా  మైనింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.కానీ ఏనాడూ కూడ  ఆ కుటుంబానికి మైనింగ్ వ్యాపారం కలిసి రాలేదు. 

మోతీలాల్  కూడ క్రిష్ణ కల్యాణ్‌పూర్ ప్రాంతంలో 25 గజాల భూమిని లీజుకు తీసుకొని  మైనింగ్  వ్యాపారం చేస్తున్నారు.   2018 సెప్టెంబర్ మాసంలో  మోతీలాల్ ప్రజాపతి ఈ  భూమిని లీజుకు తీసుకొన్నాడు.  నెల తిరిగేలోపుగానే మోతీలాల్ కు   అదృష్టం కలిసివచ్చింది. ఈ భూమిలో మైనింగ్ చేస్తుండగా  42.59 క్యారెట్‌ బరువున్న వజ్రం దొరికింది. దీని విలువ సుమారు 1.5 కోట్ల రూపాయలుంటుందని అంచనా.

ఈ వజ్రాన్ని విక్రయించి  వచ్చిన డబ్బుతో  తన పిల్లలను బాగా చదివించుకొంటానని మోతీలాల్ చెప్పారు.  ఇల్లు కట్టుకోవడంతో పాటు  తన సోదరుడి కూతుళ్లకు కూడ పెళ్లి చేస్తానని ఆయన ప్రకటించారు.  నవంబర్ మాసంలో ఎన్నికలు ముగిసిన తర్వాత  తాను ఈ వజ్రాన్ని వేలం వేయనున్నట్టు  మోతీలాల్ ప్రకటించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios