Asianet News TeluguAsianet News Telugu

అయ్యప్పను దర్శించుకున్న మహిళలు నక్సలైట్లా..?

శబరిమల అయ్యప్ప స్వామిని బుధవారం ఇద్దరు మహిళలు దర్శించుకున్న సంగతి తెలిసిందే.

bjp mp muralidharan sensational comments on sabaraimala devotees
Author
Hyderabad, First Published Jan 3, 2019, 2:19 PM IST


శబరిమల అయ్యప్ప స్వామిని బుధవారం ఇద్దరు మహిళలు దర్శించుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ మహిళలపై బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న ఇద్దరు మహిళలు నక్సలైట్లు అంటూ ఆరోపించారు.

శబరిమల వచ్చి.. అయ్యప్పను దర్శించుకున్న ఆ ఇద్దరు మహిళలు భక్తులు కాదని.. మహిళా మావోయిస్టులని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులతో సీపీఎం నేతలు ఒప్పందం కదుర్చుకొని మరీ వాళ్లను ఆలయంలోకి పంపించారని ఆయన ఆరోపించారు.  కేరళ ప్రభుత్వం సీపీఎం పార్టీ, మావోయిస్టలతో కుమ్మకయ్యిందని విమర్శించారు. హిందూ ఆలయం, అయ్యప్ప భక్తులకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాగంగానే ఆ మహిళలు ఆలయంలోకి ప్రవేశించారన్నారు.

శబరిమల అయ్యప్పస్వామిని 50 ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు దర్శించుకున్న సంగతి తెలిసిందే. అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతి ఇస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. తొలిసారిగా అయ్యప్పను ఇద్దరు మహిళలు దర్శించుకున్నారు. కాగా.. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంతో.. అపవిత్రమైందంటూ.. ప్రధాన అర్చకుడి ఆదేశాల మేరకు ఆలయ సంప్రోక్షణ చేశారు.

రెండు గంటల పాటు ఆలయాన్ని మూసివేసి మరీ.. శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఆలయాన్ని శుద్ధి చేశారంటూ ఓ న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారంటూ బీజేపీ కేరళలో బంద్ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సులు అడ్డుకున్నారు.

read more news

భక్తులే ఆ మహిళలకు సహకరించారు.. కేరళ సీఎం

శబరిమలలో మహిళల ప్రవేశం: అట్టుడుకుతున్న కేరళ

అయ్యప్ప దర్శనం అనంతరం.. డ్యాన్స్ లు చేసిన మహిళలు

శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం (వీడియో)

అయ్యప్పని దర్శించుకున్న మహిళ.. పరారీలో భర్త

శబరిమల వివాదం.. ప్రధాన అర్చకుడికి చుక్కెదురు

Follow Us:
Download App:
  • android
  • ios