Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర ప్రభుత్వ పథకం కింద రామమందిరం నిర్మించాలి: బిజెపి ఎంపి

కేంద్ర ప్రభుత్వం నిరుపేద ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అయోద్యలో రామమందిర నిర్మణాన్ని కూడా ఈ పథకం కింద చేపట్టాలని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీ ఏకంగా అయోద్య కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ వినూత్న నిరసన ద్వారా సదరు ఎంపీ సొంత పార్టీనే ఇరుకున పెట్టారు. 

bjp mp harinarayan rajbhar gave controversy statements on ram mandir
Author
Ayodhya, First Published Dec 28, 2018, 4:04 PM IST

కేంద్ర ప్రభుత్వం నిరుపేద ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అయోద్యలో రామమందిర నిర్మణాన్ని కూడా ఈ పథకం కింద చేపట్టాలని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీ ఏకంగా అయోద్య కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ వినూత్న నిరసన ద్వారా సదరు ఎంపీ సొంత పార్టీనే ఇరుకున పెట్టారు. 

అయోద్యలో రామమందిరం లేక చాలా కాలంగా శ్రీరాముడు (విగ్రహం) టెంట్ కిందే ఉంటున్నారని ఎంపీ హరినారాయణ్ రాజ్ భర్ పేర్కోన్నారు. ఇళ్లు లేని ప్రతి  ఒక్కరికి సొంతింటిని నిర్మిస్తామంటూ  కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేసిన ఆయన...రామమందిరాన్ని కూడా ఈ పథకం కింద నిర్మించాలని సూచించారు. ఇలా బిజెపి ప్రభుత్వానికి సొంత పార్టీ ఎంపీయే చురకలు అంటించారు. 

ఈ మేరకు రాజ్ నారాయణ్ అయోద్య జిల్లా కలెక్టర్ కు ఓ లేఖ రాశారు. శ్రీరాముడికి ఇంటిని కేటాయించే అంశాన్ని పరిశీలించాలని తన లేఖలో పేర్కొన్నారు. ఈ విధంగానైనా భారతీయుల కలను కేంద్రం నెరవేర్చినట్లు అవుతుందని రాజ్ నారాయణ్ పేర్కొన్నారు.

అయోద్యలో రామమందిర నిర్మాణంపై వివాదం చెలరేగింది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో వున్నందున తాము ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీలు లేకుండా ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రామ మందిరంపై రాజకీయ పార్టీల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios