Asianet News TeluguAsianet News Telugu

అప్పు ఎగ్గొట్టిన మాజీమంత్రి, బాధితురాలు ఆత్మహత్య

ఒకవైపు మాజీమంత్రి డబ్బులు ఇవ్వకపోవడం, అప్పుల వాళ్లు ఒత్తిడి తేవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంజన చంద్రాలేఔట్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అంజనా వి.శాంతవేరి.

Bjp leader, Former minister cheat woman commits suicide in karnataka
Author
Karnataka, First Published Nov 4, 2019, 9:36 AM IST

కర్ణాటక: అతనో మాజీమంత్రి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజాప్రతినిధి అయినప్పుడు అప్పులు, చేబదులు సహజం. మాజీమంత్రి కావడంతో అప్పులు ఇచ్చినా తిరిగి ఇచ్చేస్తారంటూ నమ్మకం ఏర్పడటం సహజం.  

ఆ నమ్మకమే ఓ మహిళ ఆత్మహత్యకు కారణం అయ్యింది. ఈ విషాద ఘటన బెంగళూరులోని చంద్రాలేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లో చోటుచేసుకుంది. చంద్రాలేఔట్‌కు చెందిన అంజనా వి. శాంతవేరి (35) అనే మహిళ నుంచి మాజీమంత్రి బాబు రావ్ చించనసూర్ రూ.11.88 కోట్లు అప్పుగా తీసుకున్నారు. 

తీసుకున్న అప్పు చెల్లించాలని శాంతవేరి పలుమార్లు మాజీమంత్రిని అడిగింది. మాజీమంత్రి మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. ఇటీవలే ఆ మాజీమంత్రి అధికార బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరడంతో ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. 

మాజీమంత్రి చెప్పలేకపోవడంతో ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మాజీ మంత్రి బాబు రావ్ చించనసూర్ పై కోర్టులో కేసు వేశారు. కేసు విచారణలో కొనసాగుతుంది. అయితే అంజనా వి.శాంతవేరి కూడా ఇతరుల దగ్గర నుంచి అప్పులు చేసి మాజీమంత్రికి ఇచ్చారు. 

అయితే అప్పుల వాళ్ల నుంచి అంజనాకు అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి అధికమవ్వడంతో ఆమె తీవ్రంగా మనస్తాపానికి లోనయ్యారు. ఒకవైపు మాజీమంత్రి డబ్బులు ఇవ్వకపోవడం, అప్పుల వాళ్లు ఒత్తిడి తేవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు.  

అంజన చంద్రాలేఔట్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అంజనా వి.శాంతవేరి. ఆత్మహత్యకు ముందు ఆమె కుమారునికి ఫోన్‌ చేసి తన మృదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పినట్లు తెలుస్తోంది.  

శాంతవేరి ఆత్మహత్యపై చంద్రాలేఔట్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి బాబు రావ్ చించనసూర్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయన స్వస్థలం కలబుర్గి జిల్లా చించోళి. 

Follow Us:
Download App:
  • android
  • ios