Asianet News TeluguAsianet News Telugu

దమ్ముంటే చచ్చిపోమన్న లవర్.. విషం తాగిన యువతి

నాలుగు నెలల క్రితం దివ్య, హరీష్ లు ఇంటి నుంచి పారిపోయారు కూడా. అయితే.. పెళ్లి చేస్తామని హామీ ఇచ్చి.. దివ్య, హరీష్ లను వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చారు.

Bengaluru girl accepts challenge from boyfriend, drinks poison
Author
Hyderabad, First Published Nov 2, 2018, 11:30 AM IST

ప్రేమ కోసం, ప్రేమించిన యువకుడిని దక్కించుకునేందుకు ఓ యువతి చావు బుతకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.  దమ్ముంటే చచ్చిపో.. అంటూ లవర్ చెప్పిన మాటలకు నిజంగానే ఆ యువతి విషం దాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు పట్టణంలోని కితగనూర్ ప్రాంతానికి చెందిన దివ్య(20) అనే యువతి స్థానిక ప్రైవేటు కాలేజీలో బీకామ్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా.. ఆమె అదే ప్రాంతానికి చెందిన హరీష్ అనే యువకుడిని ప్రేమించింది.

నాలుగు నెలల క్రితం దివ్య, హరీష్ లు ఇంటి నుంచి పారిపోయారు కూడా. అయితే.. పెళ్లి చేస్తామని హామీ ఇచ్చి.. దివ్య, హరీష్ లను వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చారు.  ఆ తర్వాత.. హరీష్ తో పెళ్లి కి దివ్య వాళ్ల ఇంట్లో అంగీకారం తెలిపారు. ఎప్పుడైతే వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో.. అప్పుడు హరీష్ తన వక్ర బుద్ధిని బయటపెడ్టాడు.

తనకు కట్నంగా రూ.15లక్షలు ఇస్తేనే దివ్యను పెళ్లి చేసుకుంటానని లేకపోతే...వేరే యువతిని పెళ్లి చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టాడు. అంత నగదు వారి వద్ద లేకపోవడంతో దివ్య తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. అయితే.. ఈలోపు దివ్య.. హరీష్ ఫోన్ లో మెసేజ్ చేసింది. ఎలాగైనా తనని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది.

ఆమె అభ్యర్థను హరీష్ తిరస్కరించాడు. ‘‘నువ్వు చచ్చినా నాకు ఎలాంటి బాధలేదు. నేనే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’’ అని తేల్చిచెప్పాడు. అయినప్పటికీ దివ్య బ్రతిమిలాడటంతో.. నీకు దమ్ముంటే చచ్చిపోమ్మని మెసేజ్ చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన దివ్య నిజంగా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతోంది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios