Asianet News TeluguAsianet News Telugu

తేనెటీగల దాడి.. శవాన్ని వదిలేసి పారిపోయారు

తమ కుటుంబసభ్యుడు మృతి చెందడంతో... బాధనంతా గుండెల్లో దాచుకొని.. శవానికి అంత్యక్రియలు నిర్వహిద్దామని స్మశానానికి వచ్చారు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తుంటే... ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. 

Bees: Funerals Interrupted and Death Superstitions
Author
Hyderabad, First Published May 4, 2019, 11:03 AM IST

తమ కుటుంబసభ్యుడు మృతి చెందడంతో... బాధనంతా గుండెల్లో దాచుకొని.. శవానికి అంత్యక్రియలు నిర్వహిద్దామని స్మశానానికి వచ్చారు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తుంటే... ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. అంతే... శవాన్ని అక్కడే వదిలేసి పరుగులు పెట్టారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్టణతాలూకా పీ.హళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...గ్రామానికి చెందిన దొళ్లయ్య వయోభారంతో మృతి చెందడంతో భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గ్రామ శివార్లలోని స్మశానికి చేరుకున్నారు.

ఈ సమయంలో అక్కడి చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో దొళ్లయ్య భౌతిక కాయాన్ని అక్కడే వదిలేసి కుటుంబ సభ్యులు ,గ్రామస్థులు దూరంగా పారిపోయారు. అయినప్పటికీ వెంటబడ్డ తేనెటీగలు దాడి చేయడంతో పది మందికి గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన మండ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios