Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య కేసు విచారణ బెంచ్: తెలుగు జడ్జికి చోటు

వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి కేసును విచారించేందుకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. 
 

5-judge constitution bench of SC to hear Ayodhya case on January 10
Author
Delhi, First Published Jan 8, 2019, 6:20 PM IST


ఢిల్లీ : వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి కేసును విచారించేందుకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తారని సుంప్రీకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో తెలుగువారైన జస్టిస్ ఎన్ వీ రమణ పేరు కూడా ఉండటం విశేషం. 

ఎన్వీ రమణతోపాటు జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిట్ యూయూ లలిత్, జస్టిట్ డీవై చంద్రచూడ్ లు ఉన్నారు. ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నెల 10 నుంచి అయోధ్య కేసుపై విచారణ జరపనుంది.  

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతం గురించి దాఖలైన ఈ కేసు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు ప్రాంతంలో వివాదాస్పద 2.77ఎకరాల భూమిని నిర్మోహీ అఖారా, రామ్‌ లల్లా, సున్నీ వక్ఫ్‌ బోర్డులకు మూడు భాగాలుగా పంచుతూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios