Asianet News TeluguAsianet News Telugu

వివాహితను పంచుకున్న ఆటోడ్రైవర్లు: రూమ్‌లో, కదులుతున్న ఆటోలో అత్యాచారం

హర్యానాలో దారుణం జరిగింది. ఆటో ఎక్కిన ఓ వివాహితపై కన్నేసిన ఆటోడ్రైవర్లు కదులుతున్న ఆటోలోనే ఒకరి తర్వాత ఒకరు పంచుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన ఓ 42 ఏళ్ల మహిళ భర్త 2013లో మరణించాడు.

42 years old women raped by auto drivers at gurugram
Author
Gurugram, First Published Jan 1, 2019, 12:12 PM IST

హర్యానాలో దారుణం జరిగింది. ఆటో ఎక్కిన ఓ వివాహితపై కన్నేసిన ఆటోడ్రైవర్లు కదులుతున్న ఆటోలోనే ఒకరి తర్వాత ఒకరు పంచుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన ఓ 42 ఏళ్ల మహిళ భర్త 2013లో మరణించాడు. ఈ క్రమంలో భర్తకు రావాల్సిన ఫించన్, ఇతర భత్యాల కోసం ఆమె గురుగ్రామ్‌లో భర్త పనిచేసిన కార్యాలయానికి వెళ్లారు.

అక్కడ పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు గాను శనివారం మధ్యాహ్నం 2.20 ప్రాంతంలో 8వ నెంబర్ జాతీయ రహదారి వద్ద అంకిత్ అనే వ్యక్తి నడుపుతున్న ఆటో  ఎక్కారు. అప్పటికే అందులో మరో దీపక్ అనే మరో ఆటోడ్రైవర్ ఉన్నారు.

అంకిత్ ఆమెను ఐఎంటీ మానేసర్ నుంచి బంగ్రోలాలోని దీపక్ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు. అప్పటికే మరో వ్యక్తి అక్కడ వీరి కోసం వేచి ఉన్నారు. ముగ్గురు కలిసి రాత్రి 9 గంటల వరకు వివాహితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం అంకిత్, దీపక్‌లు ఆటోలో ఆమెను తీసుకుని రామ్‌పూరలోని మరో ఇద్దరు ఆటోడ్రైవర్లకు వివాహితను అప్పగించారు. వారు మరో వ్యక్తిని పిలిచి.. అతను ఆటో నడుపుతుండగా వీరిద్దరూ ఆమెపై అత్యాచారం చేశారు.

12 గంటల పాటు సాగిన ఈ పైశాచిక పర్వం తర్వాత అర్థరాత్రి ఈమెను రామ్‌పురా ఫ్లైఓవర్ సమీపంలోని ఓ దాబా వద్ద విడిచిపెట్టారు. అపస్మారక స్థితిలో పడివున్న వివాహిత ఆదివారం ఉదయం పోలీసులను ఆశ్రయించింది.

రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన అంకిత్, దీపక్, మహిపాల్, అజిత్, సన్నులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ 24 నుంచి 27 ఏళ్లలోపు వారేనని పోలీసులు వెల్లడించారు. వీరిపై ఐపీసీ 376 డీ, 120 బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మరో ఆటో డ్రైవర్‌ను గాలిస్తున్నారు.

కాగా, 2017 మే 29న తన ఎనిమిది నెలలో కుమార్తెతో కలిసి ఆటో ఎక్కిన మహిళలపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఆమె చేతిలోని చిన్నారిని రోడ్డుపైకి విసిరేశారు. తలకు తీవ్రగాయమైన చిన్నారి ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios