Asianet News TeluguAsianet News Telugu

దేశంలో 16కోట్ల మంది మందు బాబులు

మన దేశంలో 16కోట్ల మంది మందుబాబులు ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడయ్యింది

16 crore Indians consume alcohol, these states being highest consumers: Survey
Author
Hyderabad, First Published Feb 19, 2019, 10:27 AM IST

మన దేశంలో 16కోట్ల మంది మందుబాబులు ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడయ్యింది.  కేంద్ర సమాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ ఎయిమ్స్ తో కలిసి తాజాగా ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో 16కోట్ల మంది ప్రజలు మద్యానికి బానిసలుగా మారినట్లు తేలింది.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో 14.6శాతం మంది(16కోట్లు) మద్యానికి అలవాటు పడ్డారు. వీరంతా 10 నుంచి 75ఏళ్ల వయసువారేనని ఆ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాలు మద్యం వినియోగంలో ముందు వరసలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నల్లమందు వినియోగిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

మద్యం తర్వాత గంజాయి, నల్లమందు వంటి మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగా ఉందని సర్వేలో వెల్లడయ్యింది. దేశవ్యాప్తంగా 186జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. 3.1కోట్ల మంది గంజాయికి బానిసలుగా మారినట్లు తేలింది. 72లక్షల మంది గంజాయి కారణంగా అనారోగ్యానికి కారకులయ్యారని తెలిసింది. ఈ మద్యం కారణంగా 4.6లక్షల మంది చిన్నారులు.. 18లక్షల మంది యువకులు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని సర్వే చెబుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios