Asianet News TeluguAsianet News Telugu

ప్రశాంతంగా ముగిసిన ఆరోదశ లోక్‌సభ ఎన్నికలు ...పశ్చిమ బెంగాల్‌లో రికార్డు పోలింగ్

దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(ఆదివారం) ఏడు రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. ఆరో దశ ఎన్నికల్లో ఓటర్లు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఇలా ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు  ఏడు రాష్ట్రాల్లో  కలిపి 59.70శాతం  పోలింగ్ నమోదైనట్లు ఈసి ప్రకటించింది.

lok sabha elections 2019, sixth phase live updates
Author
New Delhi, First Published May 12, 2019, 7:17 AM IST

 పశ్చిమ బెంగాల్‌లో రికార్డు  స్థాయిలో పోలింగ్  

దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(ఆదివారం) ఏడు రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. ఆరో దశ ఎన్నికల్లో ఓటర్లు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఇలా ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు  ఏడు రాష్ట్రాల్లో  కలిపి 59.70శాతం  పోలింగ్ నమోదైనట్లు ఈసి ప్రకటించింది.

ఇక రాష్ట్రాలవారిగా పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా 80.13 శాతం రికార్డు స్థాయి పోలింగ్ నమోదయ్యింది. ఆ తర్వాత జార్ఖండ్ లో 64.46, హర్యానాలో 62.14, మధ్య ప్రదేశ్ లో 60.12, డిల్లీలో 55.44, బిహార్ లో 55.04, ఉత్తర ప్రదేశ్ లో అత్యల్పంగా 50.82 శాతం పోలింగ్ నమోదయ్యింది. అయితే ఈ పోలింగ్ శాతాల్లో స్వల్పంగా  మార్పులుండే అవకాశం  వుందని ఈసీ తెలిపింది. 

నాలుగు గంటల వరకు పోలింగ్ శాతం 

ఆరోవిడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 7 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా  జరుగుతోంది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నాలుగు గంటల వరకు జరిగిన పోలింగ్ వివరాలను కొద్దిసేపటి క్రితమే ఈసీ ప్రకటించింది.  మొత్తం  అన్ని రాష్ట్రాల్లో కలిపి 50.77శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇక రాష్ట్రాలవారిగా పోలింగ్ శాతాలు ఇలా వున్నాయి.    

 బిహార్‌ : 44.40 శాతం 
హర్యానా : 51.86 శాతం
మధ్యప్రదేశ్‌ : 52.78 శాతం
ఉత్తర ప్రదేశ్‌ : 43.26 శాతం
ఢిల్లీ : 45.24 శాతం
పశ్చిమ బెంగాల్‌ : 70.51 శాతం
జార్ఖండ్‌ : 58.08 శాతం.
 

ఓటు హక్కును  వినియోగించుకున్న ఉపరాష్ట్రపతి

భారత  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఆయన డిల్లీలో జరుగుతున్న  పోలింగ్ లో ఆయన  తన భార్య  ఉషతో కలిసి పాల్గొన్నారు నిర్మాణ్ భవన్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో వెంకయ్య దంపతులు ఓటేశారు. 


 

ఓటేసిన  మాజీ రాష్ట్రపతి

మాజీ రాష్ట్రపతి పణబ్ ముఖర్జీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిల్లీలొని కామరాజ్ లేన్ లో ఏర్పాటు చేసిన ఎన్పీ ప్రైమరీ పోలింగ్ బూత్ లో ఆయ న ఓటేశారు.

 

ఓటేసిన ప్రియాంక గాంధీ 

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తన భర్త రాబర్ట్ వాద్రా తో కలిసి డిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయలోని  పోలింగ్ బూత్ కు చేరుకుని ఓటేశారు. 

 

నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఒంటి గంట వరకు పోలింగ్ శాతం

బిహార్‌ : 35.22 శాతం 
హర్యానా : 38.28 శాతం
మధ్యప్రదేశ్‌ : 41.66 శాతం
ఉత్తర ప్రదేశ్‌ : 34.3 శాతం
ఢిల్లీ : 31.06 శాతం
పశ్చిమ బెంగాల్‌ : 55.6 శాతం
జార్ఖండ్‌ : 47.25 శాతం.

12 గంటల వరకు పోలింగ్ శాతం

బిహార్‌ : 20.70 శాతం 
హర్యానా : 23.26 శాతం
మధ్యప్రదేశ్‌ : 28.25 శాతం
ఉత్తర ప్రదేశ్‌ : 21.75 శాతం
ఢిల్లీ : 19.55 శాతం
పశ్చిమ బెంగాల్‌ : 38.26 శాతం
జార్ఖండ్‌ : 31.27 శాతం

సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్ ఢిల్లీలోని సంచార్ భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

11.30 గంటల వరకు పోలింగ్ శాతం

బిహార్‌ : 20.70 శాతం 
హర్యానా : 22.37 శాతం
మధ్యప్రదేశ్‌ : 27.39శాతం
ఉత్తర ప్రదేశ్‌ : 21.75శాతం
ఢిల్లీ : 18.16శాతం
పశ్చిమ బెంగాల్‌ : 37.99శాతం
జార్ఖండ్‌ : 27.56శాతం

దేశంలోని ప్రధాన సమస్యలపై ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, నోట్ల రద్దు, రాఫేల్ తదితర అంశాలపై ప్రజలు తీర్పును ఇవ్వబోతున్నారని రాహుల్ తెలిపారు.

ప్రధాని తన ప్రచారంలో విద్వేషాన్నే ఆయుధంగా చేసుకున్నారు. కానీ తాము ప్రేమతోనే ముందుకు వెళ్తున్నామని.. చివరికి ప్రేమే విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన భార్య రోమి, కుమార్తె అమియాతో కలిసి ఢిల్లీ మథురా రోడ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన పశ్చిమబెంగాల్‌లోని ఘటాల్ బీజేపీ అభ్యర్ధి భారతీఘోష్‌పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. భారతిని చుట్టుముట్టిన టీఎంసీ కార్యకర్తలు వ్యతిరేక నినాదాలు చేశారు.

దీంతో మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడి స్ధానిక మహిళలు ఆమెను అడ్డుకున్నారు. దీతో భారతి కంటతడి పెట్టారు. మరోవైపు పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్‌లతో ప్రవేశించి వీడియో తీశారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం భారతిని వివరణ కోరింది. 

ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ఢిల్లీ లోడీ ఎస్టేట్‌లోని సర్దేర్ పటేల్ విద్యాలయాలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఢిల్లీలోని పలు పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. మతియా మహాల్ ప్రాంతంలోని పోలింగ్ 84వ, 85వ పోలింగ్ బూత్‌లలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు ఉదయం పనిచేయలేదు. మాలవీయ నగర్‌లోని  116, 117, 122 పోలింగ్ బూత్‌లలో సైతం ఈవీఎంలు మొరాయించాయి.

తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ బంకూరలోని 254వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మాణ్ భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్‌తో కలిసి ఓటు వేశారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా కుటుంబసభ్యులతో కలిసి రోహతక్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న 111 సంవత్సరాల వృద్ధుడు

ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సివిల్ లైన్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఔరంగజేబ్ లైనులోని ఎన్‌సీ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. 

బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఘటల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారతి ఘోష్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడి వెనుక తృణమూల్ కార్యకర్తలు ఉన్నారంటూ ఆమె ఆరోపించారు. 

West Bengal: Vehicles in BJP Candidate from Ghatal, Bharti Ghosh's convoy vandalized. BJP has alleged that TMC workers are behind the attack pic.twitter.com/xdsJNkKhV8

ఢిల్లీ ఔరంగజేబు లైనులోని ఎన్‌పీ సీనియర్ సెకండరీ స్కూలులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఆప్ మహిళా నేత, ఈస్ట్ ఢిల్లీ అభ్యర్ధి అతిషి ఓటు హక్కును వినియోగించుకున్నారు.జంగ్‌పురాలోని కమలా నెహ్రూ ప్రభుత్వ సర్వోదయ విద్యాలయలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు.

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు, నార్త్ ఢిల్లీ అభ్యర్ధి మనోజ్ తివారీ యమునా విహార్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.    

9 గంటల వరకు పోలింగ్ శాతం

బీహార్- 9.03%
హర్యానా- 3.74%
మధ్యప్రదేశ్- 4.01%
ఉత్తరప్రదేశ్- 6.86%
పశ్చిమ బెంగాల్- 6.58%
జార్ఖండ్- 12.45%
ఢిల్లీ- 3.74%

కర్నాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈస్ట్ ఢిల్లీ పరిధిలోని పాండవ్‌పూర్‌లో ఆయన ఓటు వేశారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఓటు భక్కును వినియోగించుకున్నారు. నిజాముద్దీన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత అజేయ్ మాకేన్ న్యూఢిల్లీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో త్రిముఖ పోరు ఏమీ లేదని..పోటీ అంతా బీజేపీ, కాంగ్రెస్ మధ్యేనని అన్నారు. ఈ పోరులో కాంగ్రెస్ విజయం తథ్యమని మాకెన్ ధీమా వ్యక్తం చేశారు.  

పశ్చిమబెంగాల్‌లోని భగభన్‌పూర్‌లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో టీఎంసీ, బీజేపీ వర్గాలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు.

మాజీ క్రికెటర్, ఢిల్లీ ఈస్ట్ బీజేపీ అభ్యర్ధి గౌతం గంభీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓల్డ్ రాజానీ నగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌బూత్‌లో ఆయన భార్యతో కలిసి ఓటు వేశారు. 

బీజేపీ నేత, భోపాల్ అభ్యర్ధి సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ బూత్‌కు వెళ్లిన ఆమె ఓటు వేశారు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. గురుగ్రామ్‌లోని పైన్‌క్రెస్ట్ స్కూలులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో క్యూలైన్‌లో నిల్చోని కోహ్లీ ఓటు వేశాడు. 

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లోని మొత్తం 59 నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకోన్నారు. మొత్తం 979 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

కేంద్ర మంత్రులు రాధామోహన్‌ సింగ్‌, హర్షవర్ధన్‌, మేనకాగాంధీ, నరేంద్రసింగ్‌ తోమర్‌, రావు ఇంద్రజిత్‌సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌, కాంగ్రెస్‌ నేతలు దిగ్విజయ్‌సింగ్‌, భూపీందర్‌సింగ్‌ హుడా, జ్యోతిరాదిత్య సింధియా, షీలాదీక్షిత్‌, బాక్సింగ్‌ క్రీడాకారుడు విజేందర్‌సింగ్‌, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తదితరులు ఆరో దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios