Asianet News TeluguAsianet News Telugu

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై విపక్షాలతో బాబు భేటీ

ఈసీ అనుసరించిన విధానాలపై  ఏం చేయాలనే దానిపై 21 రాజకీయ పార్టీల నేతలు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

chandrababunaidu meeting with 21 parties in new delhi
Author
New Delhi, First Published May 21, 2019, 2:33 PM IST


న్యూఢిల్లీ:ఈసీ అనుసరించిన విధానాలపై  ఏం చేయాలనే దానిపై 21 రాజకీయ పార్టీల నేతలు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

మంగళవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సహా పలు బీజేపీయేతర పార్టీల ప్రతినిధులు న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమయ్యారు.
ఈవీఎంలను లెక్కించడానికి ముందే  వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని  విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు ఈసీ వ్యవహరశైలిపై ఆయా పార్టీలతో బాబు చర్చించే అవకాశం ఉంది.

ఈ సమావేశానికి కర్ణాటక సీఎం గైరాజరయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ తరపున అభిషేక్ సింఘ్వీతో పాటు పలు పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలపై విపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నా చేసే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఈ పార్టీలన్నీ  ఈసీకి వినతి పత్రం సమర్పిస్తారా... లేదా ధర్నా చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.21 రాజకీయ పార్టీలు ఈసీ కార్యాలయం ముందు ధర్నా చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో  భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios