Asianet News TeluguAsianet News Telugu

కేంద్రంలో పాగాకు ఉత్తర్‌ప్రదేశ్ కీలకం

వచ్చే ఎన్నికల్లో  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ఏ పార్టీ లేదా కూటమి ఎక్కువ సీట్లు కైవసం చేసుకొంటే కేంద్రంలో ఆ పార్టీకి  లేదా కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Uttarpradesh: key state for upcoming parliament elections to all parties
Author
Lucknow, First Published Feb 28, 2019, 3:24 PM IST

లక్నో: వచ్చే ఎన్నికల్లో  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ఏ పార్టీ లేదా కూటమి ఎక్కువ సీట్లు కైవసం చేసుకొంటే కేంద్రంలో ఆ పార్టీకి  లేదా కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ 71 ఎంపీ స్థానాలను ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండే కైవసం చేసుకొంది. బీజేపీకి ఏకపక్షంగా ఎంపీ సీట్లు దక్కడంలో యూపీ రాష్ట్రం కీలక పాత్ర పోషించింది. అయితే యూపీలో విపక్షాల మధ్య పోటీ లేకుండా ఉంటే బీజేపీని మరింత దెబ్బతీయవచ్చని  కాంగ్రెస్ పార్టీ భావించింది.

కానీ, కాంగ్రెస్ పార్టీ  ప్రతిపాదన పట్ల యూపీలో సమాజ్ వాదీ, బీఎస్పీలు  అంతగా ప్రతిస్పందించలేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీలు కూటమిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఈ కూటమి కొనసాగుతోందని ఈ రెండు పార్టీలు ప్రకటించాయి.

ఎస్పీ, బీఎస్పీతో పాటు ఆర్‌ఎల్డీ కూడ జతకట్టింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ 38, సమాజ్ వాదీ పార్టీ 37, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయనుంది. యూపీలో  పార్టీకి నూతనోత్తేజం తెచ్చేందుకుగాను  కాంగ్రెస్ పార్టీ ప్రియాంకగాంధీని రంగంలోకి తీసుకొచ్చింది. 

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ప్రియాంకకు కట్టబెట్టారు. ఇదే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు జ్యోతిరాదిత్య సింధియాకు  ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు.  

గత ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి బీజేపీ 71 స్థానాలను గెలుచుకోవడంలో అమిత్ షా వ్యూహాం ఉంది. అయితే ఈ దఫా బీజేపీని దెబ్బకొట్టేందుకు ఎస్పీ, బిఎస్పీలు ప్లాన్ చేస్తున్నాయి.గత ఎన్నికల్లో  బిఎస్సీపీకి ఒక్క ఎంపీ సీటు కూడ దక్కలేదు.  ఎస్పీ ఐదు,  ఏడీ రెండు,  కాంగ్రెస్ రెండు,  బీజేపీ 71 స్థానాలను దక్కించుకొంది.

పశ్చిమ యూపీలో బీఎస్పీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనుంది.ఈ ప్రాంతంలో దళితు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. సెంట్రల్ యూపీలో ఎస్పీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనుంది.ఈ ప్రాంతంలో యాదవ ప్రాబల్యం ఉంటుంది.

మోడీ, రాజ్‌నాథ్ సింగ్  ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కన్నౌజ్ నుండి అఖిలేష్ యాదవ్ బరిలోకి దిగే చాన్స్ ఉంది. నగీనా లేదా అక్బర్‌పూర్ నుండి మాయావతి పోటీ చేసే ఛాన్స్  ఉంది. ఈ రెండు పార్టీల కూటమి ఏ మేరకు  బీజేపీని నిలువరిస్తోందో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios