Asianet News TeluguAsianet News Telugu

ఖాకీ అండర్ వేర్ వేసుకుంది: జయప్రదపై ఆజం ఖాన్, బిజెపి ఫైర్

ప్రస్తుత బిజెపి అభ్యర్థి తనపై ఎన్నో ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలన్నీ తప్పు అని, మరణించిన తన తల్లిపై ఒట్టేసి ఆ విషయం చెబుతున్నానని ఆజం ఖాన్ అన్నారు. నేను పిరికివాడిని కాను, ఒక వేళ నేను ఆ మాటలు అని వుంటే మీ ముందే అంగీకరించేవాడినని అన్నారు.

Rampur: Azam Khan makes comments against Jaya Prada
Author
Rampur, First Published Apr 15, 2019, 8:23 AM IST

రాంపూర్: సినీ నటి, రాంపూర్ బిజెపి అభ్యర్థి జయప్రదపై సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యల మీద బిజెపి మండిపడుతోంది. జయప్రద ఖాకీ అండర్ వియర్ ధరించిందని తాను 17 రోజుల్లోనే గుర్తించానని ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

ప్రస్తుత బిజెపి అభ్యర్థి తనపై ఎన్నో ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలన్నీ తప్పు అని, మరణించిన తన తల్లిపై ఒట్టేసి ఆ విషయం చెబుతున్నానని ఆజం ఖాన్ అన్నారు. నేను పిరికివాడిని కాను, ఒక వేళ నేను ఆ మాటలు అని వుంటే మీ ముందే అంగీకరించేవాడినని అన్నారు. రాజకీయాల్లో తాను అంతగా దిగజారానా అని ఆయన ప్రశ్నించారు. 

ఈ వ్యక్తి పదేళ్ల పాటు రాంపూర్ రక్తం తాగిందని ఆయన జయప్రదను ఉద్దేశించి అన్నారు. వేలు పట్టుకుని తాను ఆ వ్యక్తిని రాంపూర్ తీసుకుని వచ్చానని, రాంపూర్ వీధుల్లో ఆమెను పరిచయం చేశానని, ఆమెను ఇతరులెవరూ తాకకుండా.. ఆమెపై అసభ్య పదజాలం వాడుకుండా చూసుకున్నానని ఆజం ఖాన్ అన్నారు. 

పదేళ్ల పాటు ఆ వ్యక్తిని మీ ప్రతినిధిగా ఎన్నుకున్నారని అంటూ ఓ "రాంపూర్ ప్రజలారా... ఓ షాహ్ బాద్ ప్రజలారా.. ఓ భారత ప్రజలారా... ఆ వ్యక్తిని గుర్తించడానికి మీకు 17 ఏళ్లు పట్టింది, ఆ వ్యక్తి ఖాకీ అండర్ వియర్ వేసుకుందని నేను 17 రోజుల్లోనే గుర్తించాను" అని ఆజం ఖాన్ అన్నారు. 

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలోనే ఆజంఖాన్ రాంపూర్ ర్యాలీలో జయప్రదపై ఆ వ్యాఖ్యలు చేశారు. బిజెపికి సైద్ధాంతిక భూమికను అందిస్తున్న ఆర్ఎస్ఎస్ అర్థంలో ఆజంఖాన్ ఖాకీ అనే పదం వాడారు. 

ఆజంఖాన్ వ్యాఖ్యలపై బిజెపి అధికార ప్రతినిధి చంద్ర మోహన్ విరుచుకుపడ్డారు. ఆజంఖాన్ తన వ్యాఖ్యల ద్వారా రాజకీయాలను దిగజార్చారని ఆయన అన్నారు. మహిళలను అతను కించపరిచాడని, అది సోషలిస్టు పార్టీగా చెప్పుకునే ఎస్పీ, ఆజం ఖాన్ అసలు ముఖమని ఆయన అన్నారు.

సంబంధిత వార్త

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios