Asianet News TeluguAsianet News Telugu

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

తన అశ్లీల చిత్రాలను రాంపూర్ లో విరివిగా ప్రచారంలో పెట్టారని, తనను రక్షించాలని వేడుకున్నానని, కానీ రాంపూర్ లో ఏ నాయకుడు కూడా తనను రక్షించడానికి ముందుకు రాలేదని జయప్రద అన్నారు. ఆ స్థితిలో తాను రాంపూర్ ను వదిలేసి వెళ్లాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. 

Jaya Prada targets Mulayam Singh at Rampur
Author
Rampur, First Published Apr 13, 2019, 4:43 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. తన ప్రచారంలో ఆమె సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 

తన అశ్లీల చిత్రాలను రాంపూర్ లో విరివిగా ప్రచారంలో పెట్టారని, తనను రక్షించాలని వేడుకున్నానని, కానీ రాంపూర్ లో ఏ నాయకుడు కూడా తనను రక్షించడానికి ముందుకు రాలేదని జయప్రద అన్నారు. ఆ స్థితిలో తాను రాంపూర్ ను వదిలేసి వెళ్లాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. 

"ఆజం ఖాన్ సాహెబ్! నేను మిమ్మల్ని భాయ్ అని పిలిచా. కానీ మీరు సోదరిని కించపరిచారు. నన్ను అవమానించారు.  నిజంగానే సోదరుడైతే నన్ను నాట్యగత్తే అని అంటాడా. అందుకే నేను రాంపూర్ ను విడిచి వెళ్లాలని అనుకున్నా" అని జయప్రద అన్నారు.

జయప్రద బిజెపిలో చేరి రాంపూర్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆమె రాంపూర్ నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. స్థానిక ఎస్పీ నేత ఆజం ఖాన్ తో విభేదాల కారణంగా ఆమె ఎస్పీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios