Asianet News TeluguAsianet News Telugu

నేను చస్తే, సంతోషిస్తావా: ఆజంపై జయప్రద మండిపాటు

"నేను భయపడి పారిపోతానని అనుకుంటున్నావా, నేను పారిపోను" అని జయప్రద ఆజంఖాన్ ను ఉద్దేశించి అన్నారు. ఆజంఖాన్ ఎన్నికల్లో గెలిస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని, మహిళలకు స్థానం ఉండదని, అందువల్ల ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఆమె సోమవారంనాడు అన్నారు.

"Should I Die? Will That Satisfy You?": Jaya Prada Hits Back At Azam Khan
Author
Rampur, First Published Apr 15, 2019, 1:18 PM IST

రాంపూర్: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ పై రాంపూర్ లోకసభ సీటు బిజెపి అభ్యర్థి జయప్రద తీవ్రంగా మండిపడ్డారు. మహిళల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోటీ చేయకుండా ఆజంఖాన్ ను నిషేధించాలని ఆమె అన్నారు. 

"నేను భయపడి పారిపోతానని అనుకుంటున్నావా, నేను పారిపోను" అని జయప్రద ఆజంఖాన్ ను ఉద్దేశించి అన్నారు. ఆజంఖాన్ ఎన్నికల్లో గెలిస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని, మహిళలకు స్థానం ఉండదని, అందువల్ల ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఆమె సోమవారంనాడు అన్నారు. నేను చచ్చిపోతే, సంతోషిస్తావా అని జయప్రద ఆజంఖాన్ ను ప్రశ్నించారు.  

ఆజంఖాన్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదని,  2009లో తాను ఆయన పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా తనకు మద్దతు ఇవ్వలేదని, పైగా తనపై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె చెప్పారు. ఆజంఖాన్ మాటలను మహిళగా తాను తిరిగి వల్లించలేనని ఆమె అన్నారు. 

ఆజంఖాన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. మహిళపై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎస్పీ నాయకులు మౌనంగా ఉండిపోయారని ఆమె అన్నారు. రాజకీయాలకు ఓ స్థానం ఉందని, వాటిలో మహిళలకు కూడా ఓ స్థానం ఉందని ఆమె అన్నారు. 

 

 

 

         ఈ వార్తలు కూడా చదవండి...

  జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: మాట మార్చిన ఆజంఖాన్

జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: ఆజంఖాన్‌‌పై కేసు నమోదు

ఖాకీ అండర్ వేర్ వేసుకుంది: జయప్రదపై ఆజం ఖాన్, బిజెపి ఫైర్

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

అభ్యంతకర వ్యాఖ్యలు: ఆజం ఖాన్ కు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

 

Follow Us:
Download App:
  • android
  • ios