Asianet News TeluguAsianet News Telugu

తప్పు చేశామనే ఫీలింగ్.. మళ్లీ ‘వర్జిన్’ గా మారేందుకు..

తొలిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడే వారు వారి ‘వర్జినిటీ’ని కోల్పోవాల్సి వస్తుంది. అయితే.. అలా పోయిన వర్జినీటిని తిరిగి పొందొచ్చట. 

women having intrest on verginity repair operation to be pure agian
Author
Hyderabad, First Published Feb 1, 2019, 4:25 PM IST

చాలా మంది యువత పెళ్లికి మందే సెక్స్ అనుభవాన్ని రుచి చూస్తున్నారు. అయితే.. తొలిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడే వారు వారి ‘వర్జినిటీ’ని కోల్పోవాల్సి వస్తుంది. అయితే.. అలా పోయిన వర్జినీటిని తిరిగి పొందొచ్చట. ఇప్పటి వరకు చాలా మంది యువతులు కోల్పోయిన తమ వర్జినిటీని తిరిగి పొందారని నేషనల్ హెల్త్ సర్వీస్ స్వయంగా వెల్లడించింది.

అమ్మాయిలు తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు కన్నెపొరగా పిలిచే హైమన్ పొర చిరిగిపోయి రక్తస్రావం జరుగుతుంది. తొలిసారి మాత్రమే ఇలా జరుగుతుంది. తర్వాత ఇలా జరగదు. అయితే.. బ్రిటన్ కి చెందిన మహిళలు సెక్స్ లో పాల్గొన్న తర్వాత కూడా ఈ పొర తిరిగి ఏర్పడటం కోసం సర్జరీలు  చేయించుకుంటున్నారు. మళ్లీ వర్జిన్ గా చెప్పుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఈ సర్జరీలో హైమెన్ పొరను తిరిగి ఏర్పడేలా చేస్తారు. వెజినా పైభాగంలో దళసరిగా ఉండే ఈ పొర అంగప్రవేశం సమయంలో చిరిగిపోతుంది. దాన్ని కుట్ల ద్వారా తిరిగి ఏర్పడేలా డాక్టర్లు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. తర్వాత సదరు మహిళ మళ్లీ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆ పొర తిరిగి చిరిగిపోయి రక్తస్రావం అవుతుంది. అంటే మళ్లీ సెక్స్ చేసేప్పుడు సదరు మహిళ వర్జిన్ అనే భావన పార్టనర్‌కు కలుగుతుంది. 

అరగంట సమయం పట్టే ఈ సర్జరీకి వెయ్యి పౌండ్ల ఖర్చవుతుంది. 2007 నుంచి 2017 మధ్య 109 మంది మహిళలు ఈ సర్జరీలు చేయించుకున్నారని ఎన్‌హెచ్‌ఎస్ తెలిపింది. అయితే.. తొందరపడి తప్పుచేశామే అనే ఫీలింగ్ తో ఉన్నవాళ్లే ఎక్కువగా ఈ సర్జరీలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. అందులోనే పెళ్లికాని వారే ఈ సర్జరీ చేయించుకుంటున్నట్లు సర్వేలో తేలింది. 

Follow Us:
Download App:
  • android
  • ios