Asianet News TeluguAsianet News Telugu

వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందా..? ఇదిగో పరిష్కారం

కొన్ని పండ్లు, కూరగాయలు… ముఖ్యంగా టమాటాల్లో లైకోపీన్​ ఉంటుంది. ఈ పదార్థం ఉండటం వల్లనే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్​ వల్ల వీర్య కణాల సామర్థ్యం పెరుగుతుందని వీరు గమనించారు. వాటి వేగం కూడా 40 శాతం పెరుగుతుందని చెబుతున్నారు.
 

Why tomato puree might improve male fertility
Author
Hyderabad, First Published Oct 11, 2019, 4:32 PM IST

ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి, తీసుకునే ఆహారంలో లోపం, జీవన శైలి తదితర కారణాల వల్ల సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీంతో... పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే... ఈ సమస్యకు టమాట పండుతో పరిష్కారం చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు.

టమాటలో వీర్య కణాల నాణ్యత పెంచే మిశ్రమ పదార్థం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వండిన టమాటాలను తినడం వల్ల వీర్య కణాల పరిమాణం, ఆకారంలో వృద్ధి ఉంటుందని తేలింది. ఇందులో ఉండే లాక్టోలైకోపీన్​ అనే మిశ్రమ పదార్థం వీర్య కణాల అభివృద్ధికి దోహదం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. 

ఆరోగ్యంగా ఉన్న పురుషుడు రోజుకి రెండు లేదా మూడు స్పూన్ల టమాట రసం తీసుకోవడం వల్ల వారిలొ వీర్య కణాల సంఖ్య బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.వివిధ రకాల ఔషధాలపై ప్రయోగాలు చేశారు బ్రిటన్​లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. 19 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన 60 మందిపై 12 వారాల పాటు పరిశోధనలు నిర్వహించారు.

పరిశోధనకు ముందు, తర్వాత వారి రక్త నమూనాలను సేకరించి విశ్లేషణ చేసి పలు విషయాలపై నిర్ధరణకు వచ్చారు. సాంపిల్‌ పరిమాణం చిన్నదైనప్పటికీ తమ పరిశోధనల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు.

కొన్ని పండ్లు, కూరగాయలు… ముఖ్యంగా టమాటాల్లో లైకోపీన్​ ఉంటుంది. ఈ పదార్థం ఉండటం వల్లనే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్​ వల్ల వీర్య కణాల సామర్థ్యం పెరుగుతుందని వీరు గమనించారు. వాటి వేగం కూడా 40 శాతం పెరుగుతుందని చెబుతున్నారు.

భవిష్యత్తులో  సంతానోత్పత్తికి సంబంధించిన చికిత్సల అవసరాన్ని తగ్గించడానికి తాజా శోధనలు సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు, ఎందుకంటే పిల్లులు పుట్టని చాలా కేసులలో 40 శాతానికి పైగా  స్పెర్మ్ కౌంట్ లేదా వాటి పనితీరు కారణంగా ఉన్నాయి. అటువంటివారికి టమాట చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios