Asianet News TeluguAsianet News Telugu

నిద్రకి ముందు గ్రీన్ టీ.. ఎన్ని లాభాలో

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ఈ విషయం మనకు తెలిసిందే. సులభంగా బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.

useful health benefits of drinking green tea before bed
Author
Hyderabad, First Published Mar 4, 2019, 3:37 PM IST

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ఈ విషయం మనకు తెలిసిందే. సులభంగా బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. అందుకే సాధారణ టీకి బదులు అందరూ గ్రీన్ టీనే ప్రిఫర్ చేస్తున్నారు. అయితే.. ఈ గ్రీన్ టీ పగటి కన్నా.. రాత్రి నిద్రపోయే ముందు తాగితే ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి అంటున్నారు నిపుణులు.

నిద్రపోవడానికి ఒక అరగంట లేదా గంట ముందు గ్రీన్ టీ తాగితే.. శరీర మెటాబిలిజం బాగా పెరుగుతుంది. దీంతో శరీరంలోని కొవ్వు త్వరగా కరిగే అవకాశం ఉంటుంది. తద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు.

రాత్రి నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఫ్లూ, జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు చాలా వ‌ర‌కు దూరం అవుతాయ‌ని ఇటీవ‌ల చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 

 నిద్రించ‌డానికి ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం రిలాక్స్ అవుతుంది. మ‌న‌సంతా ప్ర‌శాంతంగా మారి చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. అంతేకాదు, మ‌రుస‌టి రోజు లేచే స‌రికి ఉల్లాసం, ఉత్తేజం క‌లుగుతాయి. 

రోజంతా మ‌నం తిన్న ప‌లు ఆహార ప‌దార్థాల కార‌ణంగా శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. వాట‌న్నింటినీ క్లీన్ చేయాలంటే రాత్రి పూట నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios