Asianet News TeluguAsianet News Telugu

మంచినీరు అతిగా తాగుతున్నారా...? ప్రమాదమే

ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నా శరీరంపై ప్రతికూల ప్రభావమే చూపుతుందని తేలింది. వీరి పరిశోధనలో భాగంగా కొంతమందిని తీసుకుని అందులో సగం మందికి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలని సూచించారు. మిగతా సగం మందిని అధికంగా నీళ్లు తాగాలని చెప్పారు.

Should You Drink 3 Liters of Water per Day?
Author
Hyderabad, First Published Sep 27, 2019, 1:43 PM IST

శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలని... మంచినీరు వీలైనంత ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతుంటారు. దీంతో చాలా మంది అవసరం ఉన్నా లేకున్నా... దాహం అనిపించకపోయినా నీరు తాగేస్తూ ఉంటారు. నీరు ఎక్కువగా తాగితే... ఆకలి వేయకుండా ఉంటుందని.. అందుకోసం కూడా నీరు తాగేస్తూ ఉంటారు. అయితే... దీని వల్ల ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.

ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నా శరీరంపై ప్రతికూల ప్రభావమే చూపుతుందని తేలింది. వీరి పరిశోధనలో భాగంగా కొంతమందిని తీసుకుని అందులో సగం మందికి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలని సూచించారు. మిగతా సగం మందిని అధికంగా నీళ్లు తాగాలని చెప్పారు. అనంతరం వారి ఎంఆర్ఐ తీసి చూడగా... అందులో నీళ్లు అధికంగా తాగిన వ్యక్తుల మెదడులోని ఫ్రీ ఫ్రంటల్ ప్రాంతాలు ఎంతో చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. 

అటువంటి వారు ఏదైనా తినాలన్నా..నమలడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ సమస్య ఏర్పడితే శరీరంలోని ఫ్లూయిడ్స్ పలచబడతాయి. ఫలితంగా సోడియం ప్రమాణాలు పడిపోతాయి. దీంతో బాడీలోని కణాలు వాస్తాయి. ఫలితంగా కొన్నిసార్లు స్పృహతప్పి పడిపోతారు. పరిస్ధితి విషమిస్తే కోమాలోకి కూడా పోవచ్చు. అందుకే మనిషి దాహం వేసినప్పుడే నీరు తాగాలని వారు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios