Asianet News TeluguAsianet News Telugu

రూ.3వేలకు ‘సెక్స్ లైవ్ స్ట్రీమింగ్’..ఎగబడుతున్న జంటలు

శృంగారాన్ని లైవ్‌లో చూడాలనుకున్న వారు ముందుగా ఆన్‌లైన్ ద్వారా సదరు వ్యక్తులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. 

sex live streaming rs.3 thousand per one hour
Author
Hyderabad, First Published Nov 20, 2018, 2:46 PM IST

శృంగారం అంటే ఒకప్పుడు నాలుగు గోడల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య తంతుగా భావించేవారు. ఎప్పుడైతే సాంకేతికత పెరిగిందో..  ఈ శృంగారం కూడా నాలుగు గోడలు దాటి బయటకు వచ్చేసింది. పోర్న్ వెబ్ సైట్లు కూడా ఈ రకం కోవలోకి వచ్చేవే. తాజాగా నగరాల్లో మరోటి విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. అదే  సెక్స్ లైవ్ స్ట్రీమింగ్.

మొన్నటి వరకు పెళ్లిళ్లు లైవ్ స్ట్రీమింగ్ లో ప్రదర్శించేవారు. పెళ్లికి రాలేనివాళ్లు ఆ పెళ్లిని నెట్ లో లైవ్ లో చూసేవారు. ఇప్పుడు సెక్స్ వీడియోలను లైవ్ లో స్ట్రీమింగ్ లో ప్రదర్శిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గంటకు రూ.1500 నుంచి రూ3వేల వరకు సంపాదిస్తున్నారు దంపతులు. ఈ వీడియోలు చేయడానికి చాలా మంది జంటలు ఎగబడుతుండటం గమనార్హం. 

శృంగారాన్ని లైవ్‌లో చూడాలనుకున్న వారు ముందుగా ఆన్‌లైన్ ద్వారా సదరు వ్యక్తులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం స్కైప్, గూగుల్ హ్యాంగవుట్స్ ద్వారా వారు లైవ్‌లో ఆ దృశ్యాలను వీక్షించే అవకాశం కల్పిస్తారు. అడల్ట్ చాట్ రూముల్లో అమ్మాయిల కోసం వెతికే వారిని టార్గెట్‌గా చేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. 

వీరిలో అత్యధికులు ఉన్నత విద్యావంతులు కావడం ఇక్కడ మరో విశేషం. అంతేకాదు, వారి శృంగారాన్ని లైవ్ లో చూస్తున్న కష్టమర్  మైక్రోఫోన్ ద్వారా ఏ భంగిమలో చెబితే ఆ భంగిమలో చేస్తే అందుకు అదనంగా మరింత చెల్లించాల్సి ఉంటుంది. విలాసాల కోసం, ఈజీమనీ కోసం చాలామంది ఈ దారులను ఎంచుకుంటున్నారు.

కొందరు పురుషులైతే.. ఈజీ మనీ కోసం తమ భార్యలకు తెలీకుండా కూడా రహస్యంగా కెమేరాలు పెట్టి లైవ్ స్ట్రీమింగ్ లు ఇస్తున్నారు. తర్వాత ఆ వీడియోలు పోర్న్ వెబ్ సైట్లలో చూసి పోలీసులను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 

మరిన్ని సంబంధిత వార్తలు...

ప్రేమికుల మధ్య ముద్దు ఎవరికి లాభం..? షాకింగ్ సర్వే

భర్తని కాదని..అతనితో సంబంధం... అసలు కారణాలు ఇవే..

Follow Us:
Download App:
  • android
  • ios