Asianet News TeluguAsianet News Telugu

గర్భిణీలు నాన్ వెజ్ తినకూడదా..?

గర్భిణీగా ఉన్నప్పుడు.. మహిళలు తాజా ఆహారం, పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. 

Is Non Vegetarian Diet Safe During Pregnancy?
Author
Hyderabad, First Published Jan 26, 2019, 2:32 PM IST

గర్భిణీగా ఉన్నప్పుడు.. మహిళలు తాజా ఆహారం, పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. తీసుకునే ఆహారంలో నాన్ వెజ్ కూడా ఉండాలని చెబుతుంటారు. అయితే.. అలా అని అతిగా మాత్రం మాంసహారం తీసుకోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా నాన్ వెజ్ తింటే.. కడుపులో బిడ్డకి మనో వైకల్యం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

అమినో ఆసిడ్స్ రక్తనాళాల వృద్ధికి, కణాల అభివృద్దికి, లివర్‌, గుండె నాళాల్లో ఉండే ఫ్యాట్‌ బ్రేక్‌ చేయడానికి, టిష్యూ రిపేర్‌ చేయడానికి శరీరానికి అత్యవసరం.  అయితే..గొర్రెమాంసం, పందిమాంసం, చికెన్‌, బీఫ్‌, నట్స్‌, డైరీప్రోడక్ట్స్‌, చీజ్‌, బీన్స్‌లో అమినో ఆసిడ్స్ శాతం కాస్త ఎక్కువగా ఉంటుంది. వీటిని గర్భిణీలు ఎక్కువగా తీసుకోవడం మంచిదికాదు.

 ఈ ఆహారం గర్భస్థశిశువు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు కనుగొన్నారు. ప్రాథమికంగా ఎలుకలపై జరిపిన ఈ పరిశోధనల్ని ఇంకా క్షుణ్ణంగా చేస్తున్నట్టు చెప్పారు. పరిమితిగా తీసుకుంటే ఎలాంటి నష్టం లేదని.. అలా కాదని.. అతిగా తీసుకుంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios