Asianet News TeluguAsianet News Telugu

వారానికి మూడు సార్లు శృంగారం..ఆ సమస్యను తగ్గిస్తుంది

 వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళలకు ప్రత్యేకించి ఫేసుక్రీములతో పనిలేదని ఓ అధ్యయనంలో తేలింది. వీళ్లు అసలు వయసు కన్నా ఏడెనిమిదేళ్లు చిన్నగా కనిపిస్తారట.

health benfits of sex in men and women
Author
Hyderabad, First Published Nov 23, 2018, 4:07 PM IST

మనలో చాలామంది శృంగారం అంటే రెండు శరీరాల కలయిక, పడక సౌఖ్యం అనుకుంటారు. కానీ దానివల్ల  మనకు ఆరోగ్య పరంగా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి ఆ లాభాలేంటో.. మనమూ ఓ లుక్కేద్దామా..
 
 శరీరంలో కొవ్వు కరిగించుకోవడానికి దాదాపు అందరూ చేసే పని జిమ్ కి వెళ్లడం.  ట్రెడ్‌మిల్‌మీద 40 నిమిషాలపాటు వాకింగ్ చేయడం వల్ల కరిగే క్యాలరీలకన్నా  30 నిమిషాల శృంగారం కారణంగా అధిక క్యాలరీలు ఖర్చవుతాయట. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి దీన్ని మించిన వ్యాయామం లేదని నిపుణులు చెబుతున్నారు.

 శృంగారం కారణంగా మానవ శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్లు ఎక్కువగా  విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉంటారు. అదేసమయంలో సంతానసాఫల్యత పెరుగుతుంది. రోగనిరోధకశక్తీ వృద్ధి చెందుతుంది. దీనివల్ల విడుదలైన ఆక్సీటోసిన్‌ కారణంగా తలనొప్పి, మైగ్రెయిన్‌, కీళ్లనొప్పుల బాధలు తగ్గుతాయి. 

మెనోపాజ్‌ సమయంలో ఈస్ట్రోజెన్‌ స్థాయిలు పడిపోవడం కారణంగా చాలామంది మహిళలు  ఆస్టియోపొరోసిస్‌ బారిన పడుతుంటారు. అయితే వారంలో కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో  ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మిగిలినవాళ్ల శాతంకన్నా రెట్టింపు ఉంటుంది. దాంతో ఎముక ఆరోగ్యం క్షీణించదు. వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో పక్షవాతం, గుండెజబ్బులు కూడా రావట. యోనిగోడలు సైతం పొడిబారకుండా తేమగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 

 భార్యాభర్తల మధ్య శృంగారం అనేది శారీరక  ఆరోగ్యానికే కాదు, మానసిక అనుబంధం బలపడ్డానికీ కారణమవుతుంది. పైగా రోజూ శృంగారంలో పాల్గొనే మహిళల్లో కటిభాగంలో కండరాలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. దాంతో గర్భాశయం జారిపోకుండా ఉంటుంది. మూత్రనాళ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. 

 వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళలకు ప్రత్యేకించి ఫేసుక్రీములతో పనిలేదని ఓ అధ్యయనంలో తేలింది. వీళ్లు అసలు వయసు కన్నా ఏడెనిమిదేళ్లు చిన్నగా కనిపిస్తారట.

related news

పురుషాంగం పరిమాణం చిన్నగా ఉందా..? ఆ సమస్య తప్పదు

షాకింగ్ న్యూస్.. సెక్స్ టాయ్స్ తోనే ఎక్కువ తృప్తి

హస్త ప్రయోగానికి బానిసలయ్యారా..? ఇదిగో చిట్కాలు

Follow Us:
Download App:
  • android
  • ios