Asianet News TeluguAsianet News Telugu

తెలివితేటలు పెంచే ఆక్రోట్స్

బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలని..తెలివితేటలు మెండుగా ఉండాలని.. ఎక్కువగా స్ట్రెస్ కి లోను కాకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు. 

Does eating walnuts improves brain performance?
Author
Hyderabad, First Published Feb 14, 2019, 4:21 PM IST

బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలని..తెలివితేటలు మెండుగా ఉండాలని.. ఎక్కువగా స్ట్రెస్ కి లోను కాకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ మన చుట్టూ ఉండే పరిస్థితులు అలా ఉండవు కదా. అయితే.. కొన్ని రకాల ఫుడ్స్ మన మెదడు పనితీరు బాగా ఉండేలా చేస్తాయి. వాటిలో ఆక్రోట్స్ ముందు వరసలో ఉంటాయి అంటున్నారు నిపుణులు.

ఆక్రోట్స్ తరచూ తీసుకోవడం వల్ల.. ఏకాగ్రత పెరుగుతుంది.. అదేవిధంగా డిప్రెషన్ కి తొందరగా గురికారని ఓ సర్వేలో తేలింది. ఆక్రోట్స్ తినే వారికీ, తినని వారికీ మధ్య ఓ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కేవలం ఆక్రోట్స్ మాత్రమే కాదు.. నట్స్ తిన్నా కూడా ప్రయోజనాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు.

నట్స్  తిననివారితో పోలిస్తే.. వీటిని తీసుకునేవారికి డిప్రెషన్ కి గురయ్యే ముప్పు  8% తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ఎంజెలిస్‌ పరిశోధకులు గుర్తించారు. అదే అక్రోట్లు(వాల్ నట్స్) తీసుకునేవారికైతే 26% వరకు ముప్పు తక్కువగా ఉంటుండటం విశేషం. వీటితో శక్తి పుంజుకోవటంతో పాటు ఏకాగ్రత బాగా మెరుగవుతున్నట్టూ తేలింది. 

వాల్‌నట్స్‌లో ప్రత్యేకమైన కొవ్వు ఆమ్లాలు.. ముఖ్యంగా ఒమేగా 3 అల్ఫా లినోలిక్‌ ఆమ్లం దండిగా ఉంటుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండెకు, మెదడుకు మేలు చేస్తాయన్నది తెలిసిందే. ఇవి డిప్రెషన్ లక్షణాలు తగ్గుముఖం పట్టటానికీ ఉపయోగపడుతున్నాయని తేలింది. 

Follow Us:
Download App:
  • android
  • ios