Asianet News TeluguAsianet News Telugu

మొటిమలతో ముఖంపై గుంతలా..? ఇదిగో పరిష్కారం

తేనె, పంచదార సమపాళ్లలో తీసుకొని బాగా కలిపి కళ్ల చుట్టూ మినహాయించి ముఖానికి, మెడకు పట్టించాలి. ఆ తర్వాత వలయాకారంలో మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి నునుపుదనం రావడంతోపాటు మృతకణాలు తొలగిపోతాయి. 

Amazing Beauty Uses For Honey To Benefit Skin
Author
Hyderabad, First Published Aug 28, 2019, 4:59 PM IST

అందంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఆ అందాన్ని పెంచుకోవడం ఈతరం అమ్మాయిలు మార్కెట్లో దొరికే వివిధ రకాల క్రీములు, ఫేషియల్స్ ని వేలకు వేలు పెట్టి కొనుగోలు చేసి తమ ముఖాలపై ప్రయోగిస్తున్నారు. అయితే... వాటి వల్ల నిజంగా ప్రయోజనం చేకూరుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే... వాటికి బదులు మన కిచెన్ లోని కొన్ని పదార్థాలతో అందం పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తేనె, పంచదార సమపాళ్లలో తీసుకొని బాగా కలిపి కళ్ల చుట్టూ మినహాయించి ముఖానికి, మెడకు పట్టించాలి. ఆ తర్వాత వలయాకారంలో మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి నునుపుదనం రావడంతోపాటు మృతకణాలు తొలగిపోతాయి. మెటిమల వల్ల చాలా మంది ముఖంపై గుంతలు పడతాయి. కానీ ఇలా తేనె, పంచదారతో  కలిపి మర్దన చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్ లో ఓట్స్, పెరుగు కలిపి కొద్దిగా నీరు కూడా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంటసేపు అలానే ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి.

రెండు టీ స్పూన్ల క్యారెట్ తరుము, టీ స్పూన్ తేనె కలపాలి.  ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ చేర్చాలి. దీనిని ముఖానికి రుద్ది.. పావుగంట తర్వాత నీటితో శుభ్రం  చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చర్మం కాంతులీనుతుంది.

రెండు టీ స్పూన్ల తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి అప్లై చేసి వేళ్లతో 20 నిమిషాలపాటు మృదువుగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తుంటే ముఖంపైన జిడ్డు, మొటిమలు తగ్గిపోయే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios