Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ లో అసంతృప్తి: కేసీఆర్ పై ఎమ్మెల్యే అలక, కంటతడి

నాలుగు సార్లు అసెంబ్లీకి గెలిచిన తనను అవమానించారని కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర రావు తెలంగాణ సిఎం కేసీఆర్ అలక వహించారు. కార్యకర్తల వద్ద ఆయన కంటతడి పెట్టారు.

TRS MLA Vidyasagar rao says he was insulted
Author
Karimnagar, First Published Sep 23, 2019, 11:53 AM IST

కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అసంతృప్తి ఎప్పటికప్పుడు బయపడుతూనే ఉంది. తాజాగా, కోరుట్ల శాసనసభ్యుడు విద్యాసాగరరావు కేసీఆర్ పై అలక బూనారు. కార్యకర్తలు, అనుచరులు, మిత్రుల భేటీలో ఆయన సోమవారంనాడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

తనకు ప్రాధాన్యత లేని పదవి ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సార్లు గెలిచినవాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్ నాలుగు సార్లు గెలిచిన తనకు ఇవ్వకుండా అవమానపరిచారని ఆవేదనవ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆయన కంటతడి పెట్టుకున్నారు.

తనకు ఏ విధమైన పదవులు కూడా వద్దని, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటానని ఆయన చెప్పారు. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటి నుంచి విద్యాసాగర రావు ఎక్కువగా ప్రజల ముందుకు రావడం లేదు. 

పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యునిగా విద్యాసాగర రావును ఇటీవల నియమించారు. మంత్రి పదవి ఇవ్వకుండా చిన్నపాటి పదవి ఇచ్చారనేది ఆయన ఆవేదన. 

Follow Us:
Download App:
  • android
  • ios