Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజను కొంటాం...: మంత్రి గంగుల

తెలంగాణలోో పండిన పంట మొత్తాన్ని గిట్టుబాట ధర కల్పించి కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సివిల్ సప్తై మినిస్టర్ గంగుల కమలాకర్ తెలిపారు.  

telanganga civil supply minister gangula kamalakar talks about crops purchase
Author
Karimnagar, First Published Oct 16, 2019, 3:50 PM IST

కరీంనగర్:  తెలంగాణలో పండిన ప్రతి పంటను కొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆదేశించినట్లు సివిల్ సప్లై మినిస్టర్ గంగుల కమలాకర్ తెలిపారు. రైతుల నుండి 
ప్రతి ధాన్యపు గింజను కొనేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్ని చేశామని...ఎలాంటి ఇబ్బందులు కల్గించకుండా వారినుండి పంటను కొనుగోలు  చేయాలని సంబంధిన  అధికారులను మంత్రి ఆదేశించారు.   

 దేశంలోని రాష్ట్రాలన్నింటిలో ఇలా రైతులకు అండగా నిలబడుతున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి అన్నారు. ప్రతీ గ్రామం లో ఏ రైతు ఏం పండించారు... ఎంత పండించారు...పంట నాణ్యత ఎలా వుంది అనే వివరాలు వ్యవసాయ అధికారులు సేకరించాలని సూచించారు. ఈ వివరాల ఆధారంగా పంట కొనుగోలు జరపాలని సూచించారు.

తెలంగాణ వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అవుతుందనే అంచనాలు ఉన్నాయి. చెక్ పోస్టులు పెట్టి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వరి పంటపై దృష్టి పెట్టాలని  సూచించారు. 

గ్రామాల్లో స్థానిక నాయకలు, సర్పంచ్ లతో పాటు రైతు సమన్వయ సమితి సహకారాన్ని అధికారులు తీసుకుని ధాన్యం కొనుగోలు ప్రశాంతంగా జరపాలన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా అన్నధాతల పంటకు సరైన ధర నిర్ణయించి కొనుగోలుచేయాలని ఆదేశించారు. కిందిస్థాయి అధికారులు అలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందితే వెంటనే యాక్షన్ తీసుకోవాలని  మంత్రి గంగుల ఉన్నతాధికారులను ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios