Asianet News TeluguAsianet News Telugu

video: కరీంనగర్ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి గంగుల

కరీంనగర్ పట్టణంలో చేపట్టిన అభివృద్ది పనులను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి హామీతోనే ఈ  పట్టణాన్ని సర్వాంగ సుందరగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామని మంత్రి అన్నారు. 

Karimnagar roads will be developed on par with international standards: Gangula kamalakar
Author
Karimnagar, First Published Nov 5, 2019, 8:16 PM IST

కరీంనగర్: పట్టణంలో పలు అభివృద్ది పనులకు స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. సిటీ రెనోవేషన్ మరియు స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా మంగళవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కమాన్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ... కరీంనగర్ లో చేపడుతున్న 14.5 కిలోమీటర్ల ప్రధాన రహదారుల పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. రోడ్ల విస్తరణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న సిక్కు కమ్యూనిటీకి చెందిన జెండా గద్దె ను వారి అనుమతితో తొలగించి జంక్షన్ లో ఏర్పాటు చేయనున్నామన్నారు.

read more  అబ్దుల్లాపూర్‌మెట్ దుర్ఘటన... గుర్నాథం కుటుంబానికి ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శ

సిక్కుల పవిత్ర జెండా గద్దెను తొలగించేందుకు సహకరించిన వారికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కులమతాలకతీతంగా ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. రోడ్డు విస్తరణ పనులు మన పిల్లల భవిష్యత్తు కోసమే అని గుర్తు చేశారు.

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఖమ్మం రోడ్డు వరకు విస్తరణ చేస్తే 20 నుండి 30 ఫీట్ల రోడ్డు అదనంగా విడుదలవుతుందని తద్వారా ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ఉంటుందని మంత్రి తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా వున్న చిరు దుకాణాలు వంటివి తొలగించుకోవాలని వ్యాపారులకు మంత్రి సూచించారు.

read more తహాశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు: నిందితులు వీరేనంటూ జగ్గారెడ్డి వీడియో హల్ చల్

నగరంలో ఇప్పటికే ముఖ్యమంత్రి హామీ నిధులతో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులు, అంతర్గత రహదారులు, కేబుల్ బ్రిడ్జి, ఐఫిల్ టవర్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ సర్వాంగా సుందరంగా రూపొందుతుందని అన్నారు.

Karimnagar roads will be developed on par with international standards: Gangula kamalakar

 నగర ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక కూరగాయలు పండ్ల మార్కెట్ లు నిర్మిస్తున్నామని...ఇందుకు వ్యాపారులు సహకరించి తమ వ్యాపారాలన్నీ అందులోనే చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లో మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు వెంకటరమణ, ఏఈ లక్ష్మణ్ రావు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios