Asianet News TeluguAsianet News Telugu

ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త...

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పోరేషన్ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. హైదరాబాద్ నగరంలోని వివిధ బస్తీలకు చెందిన ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు సిద్దమచయ్యారు .నిరుద్యోగ యువతకు వివిద జాతీయ సంస్ధల చేత ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నట్లు ఎస్సీ కార్పోరేషన్ అధికారులు తెలిపారు. 

sc corporation plans to conduct skill development programme at hyderabad
Author
Hyderabad, First Published Jan 4, 2019, 8:56 PM IST

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పోరేషన్ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. హైదరాబాద్ నగరంలోని వివిధ బస్తీలకు చెందిన ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు సిద్దమచయ్యారు .నిరుద్యోగ యువతకు వివిద జాతీయ సంస్ధల చేత ఉచితంగా నైపుణ్య  శిక్షణ ఇప్పించనున్నట్లు ఎస్సీ కార్పోరేషన్ అధికారులు తెలిపారు. 

ఈ నైపుణ్య శిక్షణ కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికారులే బస్తీల బాట పడుతున్నారు. ఈ నెల 7 నుండి 10వ తేదీ వనకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి  అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు. యువకుల వయసు 18-35 ఏళ్ల మద్య వుండి, కుటుంబ వార్షికాదాయం రూ.2లక్షలకు తక్కువగా వుంటే ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణ అనంతరం వారి ప్రతిభ ఆధారంగా ఉపాదిని కల్పించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. 

కార్పోరేషన్ అధికారుల దృవపత్రాల పరిశీలనతో పాటు అభ్యర్థి అర్హత, ఆసక్తి ఆధారంగా ట్రేడులను కేటాయించనున్నారు. కంప్యూటర్ ఆదారిత, ఫార్మా, వైద్య, ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్, సేవా, స్వయం ఉపాది రంగాలతో పాటు మరికొన్ని విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ కార్పోరేషన్ అధికారులు వెల్లడించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios