Asianet News TeluguAsianet News Telugu

పది పాసైతే నేవీలో ఉద్యోగం... జీతం రూ.50వేలపైనే..

మీరు పదోతరగతి ఉత్తీర్ణత సాధించి... ఉద్యోగం కోస నిరీక్షిస్తున్నారా..? ఈ ఉద్యోగ అవకాశం మీకోసమే. ఇండియన్ నేవీలో  సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

indian navy latest notifications for jobs based on 10th qualification
Author
Hyderabad, First Published May 7, 2019, 12:46 PM IST

మీరు పదోతరగతి ఉత్తీర్ణత సాధించి... ఉద్యోగం కోస నిరీక్షిస్తున్నారా..? ఈ ఉద్యోగ అవకాశం మీకోసమే. ఇండియన్ నేవీలో  సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేవలం పురుషులకు మాత్రమే ఈ ఉద్యోగం వర్తిస్తుంది. కాకపోతే ఈ ఉద్యోగం రావాలంటే... పదో తరగతి ఉత్తీర్ణత సాధించడం తోపాటు సంగీతంలో కొంత ప్రావీణ్యం ఉండాలి.

మ్యూజికల్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్ కనుక మీకు ఉండి... 157 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉంటే..ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని ఫిజికల్ టెస్టులు ఉంటాయి. వాటిలో పాస్ అయితే.. ఉద్యోగం వచ్చినట్లే.

వాళ్లు పెట్టే ఫిజికల్ టెస్టులో 1.6కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల సమయంలో పరిగెత్తాలి. 10 పుష్ అప్ లు, 20 గుంజీలు చేయాల్సి ఉంటుంది. సెలక్ట్ అయిన వారికి  2019 అక్టోబర్‌లో ట్రైనింగ్  ప్రారంభమవుతుంది. 15 వారాల పాటు బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో, మిలటరీ మ్యూజిక్ ట్రెయినీగా ముంబైలో 26 వారాలపాటు శిక్షణ ఇస్తారు.

1994 అక్టోబర్ 1 నుంచి 2202 సెప్టెంబర్ 30వ తేదీ మధ్య జన్మించిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు. 
పే & అలవెన్సులు : ట్రెయినింగ్‌లో రూ14,600, తర్వాతరూ.21,700-69,100+రూ.5,200 ఎంఎస్‌పీ+డీఏ
దరఖాస్తు ప్రారంభం :మే 6 నుంచి
దరఖాస్తులకి చివరితేదీ : మే 19
వెబ్‌సైట్ : www.joinindiannavy.gov.in లో పూర్తి విరవాలను చూసుకొని.. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios