Asianet News TeluguAsianet News Telugu

కాబూల్ లో మరోసారి ఉగ్రదాడి..43మంది మృతి

ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు.

Scores Have Been Killed in a Siege on a Government Building in Kabul
Author
Hyderabad, First Published Dec 25, 2018, 2:34 PM IST


ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు.  కాబూల్ లోని ఓ ప్రభుత్వ  కార్యాలయంలో ముష్కరులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో 43మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు.. సాధారణ ప్రజలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 10మంది తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆఫ్ఘాన్ ప్రజా వ్యవహారాల మంత్రుత్వశాఖ ప్రాంగణంలో సోమవారం ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అనంతరం కొందరు ఉగ్రవాదులు కార్యాలయం లోపలికి వచ్చి తుపాకులతో కాల్పులు జరిపారు. ప్రాణాలను రక్షించుకునేందుకు చాలా మంది ఆఫీసు కిటికీ అద్దాల్లోంచి దూకి బయటపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

కొందరు ఉద్యోగం కార్యాలయంలోనే చిక్కుకుపోగా..వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారు. సమాచారం అందుకున్న రక్షణ సిబ్బంది.. రంగంలోకి దిగి.. దాదాపు 350మందిని రక్షించింది. కాగా.. ఈ దాడికి పాల్పడింది మేమే అంటూ.. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. అయితే.. తాలిబన్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని.. అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios