Asianet News TeluguAsianet News Telugu

కూతురిపై ప్రియుడితో రేప్, హత్య: యావజ్జీవ శిక్ష విధింపు

14 ఏళ్ల కూతురిపై ప్రియుడితో లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమెను చంపిన కేసులో సారా ప్యాకర్‌కు యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. అంతేకాదు ఈ కేసులో మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఆమె ప్రియుడు సులివన్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Sara Packer sentenced to life in murder, rape of adopted daughter, 14
Author
USA, First Published May 6, 2019, 2:52 PM IST

వాషింగ్టన్:  14 ఏళ్ల కూతురిపై ప్రియుడితో లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమెను చంపిన కేసులో సారా ప్యాకర్‌కు యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. అంతేకాదు ఈ కేసులో మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఆమె ప్రియుడు సులివన్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

అమెరికాలోని పెన్సిల్వేనియా కు చెందిన  సారా ప్యాకర్‌ 2007లో అనాధల దత్తతల విషయాలు చూసే అధికారిణిగా పని చేసేది. ఆ సమయంలో అప్పటి భర్త డేవిడ్‌తో కలిసి ఆమె ఎందరినో దత్తత తీసుకొన్నారు. గ్రేస్ అనే అమ్మాయిని కూడ దత్తత తీసుకొన్నారు.  

దత్తత తీసుకొన్న అమ్మాయిలపై డేవిడ్ లైంగిక దాడులకు పాల్పడేవాడు.  గ్రేస్‌పై కూడ అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ విషయం బయటకు తెలియడంతో  అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సారాను కూడ ఉద్యోగంలో నుండి  తొలగించారు. ఎవరినీ కూడ సారా దత్తత తీసుకోకుండా ఉండేలా అధికారులు కఠినంగా వ్యవహారించారు.  

ఇదిలా ఉంటే 2013లో సారాకు జాకబ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.  అతనితో సారా సహజీవనం ప్రారంభించింది. గ్రేస్‌పై  జాకబ్ లైంగికంగా వేధింపులకు పాల్పడేలా రెచ్చగొట్టింది. 2016లో గ్రేస్‌ను ఇంట్లోనే కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అత్యాచారం చేశాడు.  ఆ బాలికకు మత్తు మందిచ్చి వెళ్లిపోయారు.

మరుసటి రోజున గ్రేస్ కట్లు విప్పుకొంది. కానీ పారిపోలేకపోయింది. దీంతో గ్రేస్ ను చంపేశారు. ముక్కలు ముక్కలుగా  శరీర బాగాలను కోసి ఊరి చివర్లో పారేశారు. అయితే ఏమీ తెలియనట్టుగానే  తన కూతురు కన్పించకుండా పోయిందని సారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సారా తీరును అనుమానించిన పోలీసులు సారాను విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది.

Follow Us:
Download App:
  • android
  • ios