Asianet News TeluguAsianet News Telugu

బాలకోట్: విదేశీ మీడియాకు పాక్ అనుమతి నిరాకరణ

పాకిస్థాన్‌లోని  బాలాకోట్ జైషే ఉగ్రవాద శిబిరంపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడింది. అయితే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన విదేశీ మీడియాకు పాకిస్తాన్ అనుమతివ్వలేదు.
 

Pakistan stops media from visiting Jaish madrasa India bombed in Balakot
Author
Islamabad, First Published Mar 8, 2019, 5:56 PM IST

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని  బాలాకోట్ జైషే ఉగ్రవాద శిబిరంపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడింది. అయితే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన విదేశీ మీడియాకు పాకిస్తాన్ అనుమతివ్వలేదు.

బాలాకో‌ట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై  ఇండియన్  సర్జికల్ స్ట్రైక్స్ కు పాల్పడిన ప్రాంతాన్ని మీడియాకు చూపిస్తామని పాక్ తొలుత ప్రకటించింది. దీంతో వీదేశీ మీడియా ఈ ప్రాంతానికి చేరుకొనేలోపుగానే  పాక్ మాట మార్చింది. 

బాలాకో‌ట్ కు వెళ్లకుండానే  మధ్యలోనే మీడియాను పాక్ ప్రభుత్వం అడ్డుకొంది.  అయితే నిజంగా దాడులు జరిగాయా, లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది. బాలాకోట్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లిన విదేశీ మీడియాను పాక్ తిప్పిపంపడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
 

Follow Us:
Download App:
  • android
  • ios