Asianet News TeluguAsianet News Telugu

బాగ్దాదీకి చావును పరిచయం చేసింది ఈ కుక్కే

కరడుగట్టిన ఉగ్రవాది, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అంతం చేయడంలో అమెరికా సేనలకు సాయం చేసిన కుక్క ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్ ద్వారా విడుదల చేశారు.

operation mueller: america president Trump released photo of dog wounded in ISIS Chief Baghdadi raid
Author
Washington D.C., First Published Oct 29, 2019, 12:44 PM IST

కరడుగట్టిన ఉగ్రవాది, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అంతం చేయడంలో అమెరికా సేనలకు సాయం చేసిన కుక్క ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్ ద్వారా విడుదల చేశారు.

‘‘ఐసిస్ అధినేత బాగ్దాదీని అంతమొందించడంలో కీలకపాత్ర పోషించిన అద్భుతమైన శునకం చిత్రాన్ని బహిర్గతం చేస్తున్నామని.. అయితే దీనిని పేరు మాత్రం వెల్లడించమని ట్రంప్ ట్విట్టర్లో వెల్లడించారు.

అబు బకర్‌ను హతమార్చే ఆపరేషన్‌లో ఈ కుక్క వీరోచిత సేవలను అందించిందని అమెరికా జాయింట్ సైన్యాధిపతి జనరల్ మార్క్ మిలే ప్రకటించారు. యూఎస్ సైనికుల నుంచి తనను తాను రక్షించుకునే క్రమంలో బాగ్దాదీ ఆత్మాహుతి చేసుకున్నాడని.. ఆ సమయంలో కుక్కకి గాయాలయ్యాయని ఆయన ప్రకటించారు.

Also Read:లాడెన్‌ను చంపినట్లే : అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం

చికిత్స అనంతరం ఆ జాగిలం తిరిగి విధుల్లో చేరిందని వెల్లడించారు. బెల్జియం మాలినోయిస్ జాతికి చెందిన జాగిలాల్ని అమెరికా సాయుధ దళాలు ఇటువంటి ఆపరేషన్‌లో ఉపయోగిస్తుంటాయి. 2011లో ఒసామా బిన్‌లాడెన్‌ను అంతం చేసిన ఆపరేషన్‌లోనూ యూఎస్ నేవీ సీల్స్ ‘‘కైరో’’ పేరు గల మాలినోయిస్ జాతి కుక్కను వుపయోగించాయి.

బాగ్దాదీ చేతిలో దారుణ అత్యాచారానికి, చిత్రహింసలకు, చివరికి హత్యకు గురైన అమెరికా మానవ హక్కుల కార్యకర్త ‘‘ఖైలా ముల్లర్’’ పేరిట యూఎస్ దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించి.. అబు బకర్ కోసం వేట ప్రారంభించాయి.

వాయువ్య సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్‌లోని బారిషా అనే చిన్నా గ్రామంలోని బాగ్దాదీ తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న అమెరికా స్పెషల్ కమాండోలు ఆపరేషన్ ప్రారంభించారు.

పశ్చిమ ఇరాక్‌లోని అల్ అసద్ వైమానిక స్థావరం నుంచి 8 అమెరికన్ హెలికాఫ్టర్లలో ‘‘డెల్టా ఫోర్స్’’ కమాండోలు బయలు దేరారు. హెలికాఫ్టర్ల నుంచి వెలుపలికి దూసుకొచ్చిన కమాండోలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి..ప్రహరి గోడను పేల్చేసి, లోపలికి ప్రవేశించారు.

ప్రాణభయంతో వణికిపోయిన అల్ బాగ్దాదీ తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఆ ప్రాంగణంలోని ఓ సొరంగంలోకి పరారయ్యాడు. అమెరికా సైనిక జాగిలాలు తరముకుంటూ రావడంతో డెడ్ పాయింట్ వరకు పరిగెత్తాడు.

Also Read:ఐసీస్ చీఫ్ బాగ్దాదీ మృతి: ధృవీకరించిన ట్రంప్

చివరికి తప్పించుకునే మార్గం లేకపోవడం.. ఓ కుక్క మీదకు రావడంతో భయపడిపోయి తన శరీరానికి ఉన్న ఆత్మాహుతి జాకెట్‌ను పేల్చేసుకున్నాడు. దీంతో అతని శరీరం ఛిద్రమైపోయింది.

ఆ దుర్మార్గుడి చావుని నిర్ధారించడానికి కమాండోలు అక్కడిక్కడే డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. డెల్టా ఫోర్స్ అక్కడి నుంచి వెనుదిరిగిన వెంటనే.. యుద్ధవిమానాలు వచ్చి ఆ ఇంటిని నేలమట్టం చేశాయి. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ.. ఇరాక్, కుర్దిష్ నిఘా సంస్థలతో కలిసి బాగ్దాదీ ఎక్కడున్నాడనే దానిపై పక్కా సమాచారాన్ని సేకరించాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios