Asianet News TeluguAsianet News Telugu

జైలులో దావూద్ అనుచరుడి సెల్‌లోనే నీరవ్ మోడీ

యూకేలో అరెస్టైన భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి జైలులో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం నీరవ్ మోడీ ఉన్న సెల్‌లో దావూద్ అనుచరులు కూడ ఉన్నారు.

Nirav Modi may get separate jail cell, inmates to be Dawood aide
Author
London, First Published Mar 21, 2019, 5:53 PM IST

లండన్: యూకేలో అరెస్టైన భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి జైలులో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం నీరవ్ మోడీ ఉన్న సెల్‌లో దావూద్ అనుచరులు కూడ ఉన్నారు.

పంజాబా్ నేషనల్ బ్యాంక్ స్కాం లో నిందితుడుగా ఉన్న నీరవ్ మోడీని బుధవారం నాడు యూకేలో అరెస్ట్ చేశారు. అతడిని వెస్ట్ మినిష్టర్  కోర్టులో హాజరుపర్చారు.48 ఏళ్ల మోడీ దక్షిణ లండన్‌లోని జైలులో ఉన్నాడు. మోడీ ఉన్న సెల్‌లోనే పాకిస్తాన్ దేశానికి చెందిన జబీర్ మోటీ కూడ ఉన్నాడు. మోటీ దావూద్ అనుచరుడిగా పేరుంది.

లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నీరవ్ మోడీ నివాసం ఉంటున్నాడు.హోలి పండుగ రోజున మోడీ జైలుకు తరలించారు.హెచ్ఎంపీ వాండ్స్‌వర్త్ బీ కేటగీరీ జైలు ఇందులో 1628 మంది ఖైదీలను ఉండేందుకు వీలుంది. ఈ జైలును 1851లో నిర్మించారు.

1989 తర్వాత ఈ జైలును ఆధునీకీకరించారు. శానిటేషన్ తో పాటు విద్యుత్ తదితర వసతులను ఏర్పాటు చేశారు.ఈ కేసు విచారణ  ఈ నెల 29వ తేదీన ఉంది. అప్పటి వరకు ప్రత్యకే సెల్‌లో నీరవ్ మోడీని ఉంచే అవకాశం లేకపోలేదు.

లండన్‌లోని మెట్రో బ్యాంక్ పోలీసులు బుధవారం నాడు నీవర్ మోడీని అరెస్ట్ చేశారు. ఈ బ్యాంకులో కొత్త బ్యాంకు ఖాతాను ప్రారంభించేందుకు వెళ్లిన సమయంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.నీరవ్ మోడీ ఆయన సమీప బంధువు చోక్సీలు పీఎన్బీ స్కాం‌లో నిందితులు. 2018 జనవరి మాసంలో వీరిద్దరూ కూడ ఇండియా నుండి పారిపోయారు.

సంబంధిత వార్తలు

20వేల పౌండ్లకు నీరవ్ మోడీ లండన్ లో ఉద్యోగం

పీఎన్బీ స్కాం: ఎట్టకేలకు నీరవ్ మోడీ అరెస్ట్

Follow Us:
Download App:
  • android
  • ios