Asianet News TeluguAsianet News Telugu

క్యాన్సర్: కుటుంబ సభ్యుల నుండి రూ. 2 కోట్లు కాజేసింది

బ్రెయిన్ క్యాన్సర్ పేరుతో  ఓ యువతి  స్వంత కుటుంబాన్నే మోసం చేసింది.

Jail for British woman who went to extreme lengths in fake cancer fraud
Author
London, First Published Dec 17, 2018, 8:55 PM IST

లండన్:  బ్రెయిన్ క్యాన్సర్ పేరుతో  ఓ యువతి  స్వంత కుటుంబాన్నే మోసం చేసింది. తనకు బ్రెయిన్ క్యాన్సర్ లేకున్నా ఉన్నట్టుగా  తప్పుడు సమాచారమిచ్చి సుమారు రూ. 2 కోట్ల రూపాయాలను కాజేసింది.

భారత్‌కు చెందిన జాస్మిన్ మిస్త్రీ అనే యువతి తన భర్త విజయ్‌తో కలిసి యూకేలో ఉంటోంది. విజయ్ కంటే ముందే మరో వ్యక్తితో  జాస్మిన్  మిస్త్రీ పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొంది. ప్రస్తుతం విజయ్‌ను పెళ్లి చేసుకొని జీవిస్తోంది.

2013లో విజయ్‌కు ఓ నెంబర్ నుండి వాట్సాప్ కు మేసేజ్ వచ్చింది. జాస్మిన్ కు బ్రెయిన్  క్యాన్సర్‌కు ఉందని చికిత్సకు డబ్బు కావాలని సమాచారం ఉంది. ఆ మేసేజ్‌ ను చూసిన విజయ్   అడిగినంత డబ్బు ఇచ్చాడు. 2014 లో జాస్మిన్  మరో సిమ్  ద్వారా తన మాజీ భర్త ద్వారా మేసేజ్ పంపింది. 

క్యాన్సర్ వ్యాధి ముదిరిందని, మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లాలని  50 వేల పౌండ్లు ఖర్చు అవుతోందని చెప్పింది. తన బ్రెయిన్ స్కానింగ్ ఫోటోను  పంపింది. మాజీ భార్య అనే కారణంతో అతను కూడ డబ్బులు పంపాడు.

ఇలా తనకు తెలిసిన వారి నుండి  డబ్బులను వసూలు చేసింది. జాస్మిన్ ఆరోగ్యం బాగానే ఉందని, ఈ పేరుతో  డబ్బులను వసూలు చేసిందని తెలిసింది. జాస్మిన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిమ్ కార్డులను మారుస్తూ కుటుంబీకులను, స్నేహితులకు క్యాన్సర్ పేరు చెప్పి రూ. 2 కోట్లు దోచుకొందని పోలీసుల విచారణ తేలింది. ఈ విషయమై తాజాగా యూకే  కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios