Asianet News TeluguAsianet News Telugu

చేతిలో అండర్‌వేర్‌... పార్లమెంట్‌లో మహిళా ఎంపి ప్రసంగం

మహిళల దుస్థితిని వివరించడానికి ఓ ఎంపీ  ఏకంగా మహిళలు ధరించే లోదుస్తులను తీసుకుని పార్లమెంట్ కు వెళ్లారు. అంతేకాకుండా వాటిని చూపిస్తూ పార్లమెంట్ సాక్షిగా ప్రస్తుతం మహిళల సమస్యలపై ప్రసంగించారు. ఓ అత్యాచారం కేసులో బాధిత మహిళను కించపరుస్తూ కేసును వాదించిన లాయర్ పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఈ విషయాన్ని దేశ అత్యున్నత సభ ముందుకు తీసుకెళ్లడానికి మహిళా ఎంపి వినూత్న ప్రయత్నం చేశారు.

Irish MP Ruth Coppinger protested by holding up lacy underwear in parliament
Author
Ireland, First Published Nov 14, 2018, 9:06 PM IST

మహిళల దుస్థితిని వివరించడానికి ఓ ఎంపీ  ఏకంగా మహిళలు ధరించే లోదుస్తులను తీసుకుని పార్లమెంట్ కు వెళ్లారు. అంతేకాకుండా వాటిని చూపిస్తూ పార్లమెంట్ సాక్షిగా ప్రస్తుతం మహిళల సమస్యలపై ప్రసంగించారు. ఓ అత్యాచారం కేసులో బాధిత మహిళను కించపరుస్తూ కేసును వాదించిన లాయర్ పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఈ విషయాన్ని దేశ అత్యున్నత సభ ముందుకు తీసుకెళ్లడానికి మహిళా ఎంపి వినూత్న ప్రయత్నం చేశారు.

ఐర్లాండ్ లో ఇటీవల 17ఏళ్ల ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురయ్యింది.  బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా కోర్టులో ఓ లాయర్ బాధితురాలిని కించపర్చేలా వాదించాడు. ఆ యువతి ఎలాంటి అండర్ వేర్ వేసుకుందో మీరు చూశారా? అంటూ లాయర్ సాక్షులను ప్రశ్నించాడు.     అంతేకాకుండా ఆ దారుణానికి పాల్పడిన నిందితున్ని కోర్టు నిర్దోశిగా విడుదల చేసింది.

దీంతో దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థపై ప్రజలు తీవ్ర నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మహిళా ఎంపి రూత్ తమ దేశ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు ధరించే అండ‌ర్‌వేర్‌ను మిగతా ఎంపీలకు చూపిస్తూ కోపాన్ని ప్ర‌ద‌ర్శించారు. అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలు వేసుకున్న ఇలాంటి అండ‌ర్‌వేరే అంటూ నిరసన వ్యక్తం చేశారు.  
 
Follow Us:
Download App:
  • android
  • ios