Asianet News TeluguAsianet News Telugu

సర్జికల్ స్ట్రైక్స్.. భారత మీడియాను ట్రోల్ చేస్తున్న పాక్

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే

Imran Khan's Party Takes a Jibe at India After Surgical Strike 2.0 With 'Side Effects of Bollywood'
Author
Hyderabad, First Published Feb 26, 2019, 3:35 PM IST

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనకు భారత మీడియా సగర్వంగా దేశానికి తెలియజేసింది. అయితే.. ఈ దాడులపై మీడియా ప్రసారాన్ని.. పాకిస్థాన్ ఫ్రధాన మంత్రి సొంత పార్టీ పాకిస్థాన్ తెహ్రిక్ ఈ-ఇన్సాఫ్ వెటకారం చేసింది. భారత మీడియాను కించపరుస్తూ.. ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. కాగా.. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సర్జికల్ స్ట్రైక్స్ పై ఈ రోజు ఏఎన్ఐ ఓ ట్వీట్ చేసింది. ఐఏఎఫ్ మిరాజ్ 2000ఎస్‌ను ఎదుర్కునేందుకు పాకిస్థాన్ ఎఫ్16 ప్రయత్నించినప్పటికీ.. ఐఏఎఫ్ సామర్థ్యాన్ని చూసి పాక్ వైమానిక దళ విమానాలు వెనుదిరిగినట్లు వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ కో-ఆర్డినేటెడ్ ఆపరేషన్ వర్గాలు తెలిపినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

ఏఎన్ఐ చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేసిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ.. దానికి క్యాప్షన్ గా.. బాలీవుడ్ సినిమాల దుష్పలితాల ప్రభావం భారతీయ మీడియా మానసిక స్థితికి ప్రమాదకరంగా మారిందని ట్వీట్ చేసింది. గొప్ప కోసం భ్రమల్లో ముంచుతున్నారంటూ ట్వీట్ చేసింది. కాగా.. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios