Asianet News TeluguAsianet News Telugu

బూడిదకుప్పగా మారిన ప్యారడైజ్... 59కి చేరిన మృతులు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సంభవించిన కార్చిచ్చు అక్కడి ప్యారడైజ్ నగరాన్ని బూడిద కుప్పగా మార్చింది. గత వారం రోజులుగా క్యాంప్ ఫైర్, వూల్సే ఫైర్, కాల్ ఫైర్ అనే మూడు కార్చిచ్చులు ఉత్తర కాలిఫోర్నియాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి.

Hundreds of people poured in california fire
Author
California, First Published Nov 15, 2018, 1:02 PM IST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సంభవించిన కార్చిచ్చు అక్కడి ప్యారడైజ్ నగరాన్ని బూడిద కుప్పగా మార్చింది. గత వారం రోజులుగా క్యాంప్ ఫైర్, వూల్సే ఫైర్, కాల్ ఫైర్ అనే మూడు కార్చిచ్చులు ఉత్తర కాలిఫోర్నియాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి.

కార్చిచ్చుకు విపరీతమైన గాలులు తోడవ్వటంతో అది వేగంగా విస్తరిస్తూ.. సమీప ప్రాంతాలను కాల్చి పారేస్తోంది. దీనిని చల్లార్చేందుకు వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది రేయింబవళ్లు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో దావానలం ధాటికి అమెరికాలోని అత్యంత ఖరీదైన నగరంగా పేర్కోనే బుట్టే కౌంటీలోని ప్యారడైజ్ నగరం ఒక్క రోజులోనే బూడిద కుప్పగా మారింది. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన నగరం కార్చిచ్చుకు బలవ్వడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

దీనిపై హైఅలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం ప్రజలను ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆర్మీని ఆదేశించింది. ప్యారడైజ్ నగరం ఎంతోమంది హాలీవుడ్ ప్రముఖులకు కేంద్ర స్థానం. నగరంలో రేగిన మంటలను అదుపు చేసేందుకు వేలాది అగ్నిమాపక శకటాలు ప్యారడైజ్ ప్రాంతానికి తరలివెళ్లాయి.

కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 59 మంది ప్రాణాలు కోల్పోగా.... 130 మంది ఆచూకీ గల్లంతయ్యింది. కనిపించకుండా పోయిన వారిలో ఎక్కువ మంది  దాదాపు 70, 80, 90 సంవత్సరాల వృద్ధులే. వీరి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.. బాధితులను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షా కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios