Asianet News TeluguAsianet News Telugu

వికీపీడియాపై చైనా కన్నెర్ర: బ్యాన్ విధించిన డ్రాగన్

ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం ఎవరికి ఏం కావాలన్నా అందరికీ గుర్తొచ్చేది వికీపీడియా అటువంటి వికీపీడియాను చైనా నిషేదం విధించింది

china banned wikipedia
Author
Hyderabad, First Published May 16, 2019, 5:58 PM IST

ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం ఎవరికి ఏం కావాలన్నా అందరికీ గుర్తొచ్చేది వికీపీడియా ..అటువంటి వికీపీడియాను చైనా నిషేదం విధించింది. గతంలో వికీపీడియా చైనీస్ వర్షన్‌ను మాత్రమే నిషేధించిన ఆ దేశ ప్రభుత్వం తాజాగా అన్ని భాషల వికీపీడియా వెర్షన్లను బ్యాన్ చేసింది.

దాంతో పాటు దలైలామా, తియానమెన్ మసీద్ లాంటి సున్నితమైన అంశాలను సెర్చ్ చేయడం పట్ల కూడా ఆంక్షలు విధించింది. అయితే చైనా నిషేధంపై ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదని వికీపీడియా తెలిపింది.

తమ దేశ సంస్కృతిని పరిరక్షించుకునే చర్యల్లో భాగంగా, అలాగే చైనాలోని ఇంటర్నెట్ వినియోగదారులు విదేశాల ప్రభావాలకు లోనుకాకుండా అరికట్టేలా ‘‘ కల్చరల్ గ్రేట్‌వాల్‌’’ను రూపొందిస్తున్నట్లు తెలిసింది.

ప్రజల ఆలోచనలకు సరైన దిశానిర్దేశం చేసేలా స్వంత ఎన్‌సైక్లోపీడియా రూపొందించనున్నారని టెక్ నిపుణులు తెలిపారు. అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజాలైన గూగుల్,ఫేస్‌బుక్, లింక్డ్ ఇన్‌పై చైనాలో ఇప్పటికే నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.

చైనా కఠిన నిబంధనల నేపథ్యంలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2019లో చైనా 177 ర్యాంక్ పొందింది. అలాగే 2015లో అమెరికా విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం అత్యంత కఠినమైన ఆన్‌లైన్ వినియోగ విధానాలు ఉన్న 65 దేశాల్లో చైనా కూడా ఒకటి. కాగా చైనా కన్నా ముందు టర్కీలో కూడా వికీపీడియాపై నిషేధం ఉండటం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios