Asianet News TeluguAsianet News Telugu

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

రసాయనశాస్త్రంలో బుధవారం నాడు ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది.  

Chemistry Nobel goes to three scientists for developing lithium-ion batteries
Author
Washington, First Published Oct 9, 2019, 4:38 PM IST

వాషింగ్టన్: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. 2019 ఏడాదికి గాను  ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడీష్ అకాడెమీ బుధవారంనాడు ప్రకటించింది.

జాన్ బి. గుడెనఫ్,ఎం.స్టాన్లీ విట్టింగమ్, ఆకిరా మోషివోకు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందిస్తామని  రాయల్ స్వీడీష్ అకాడమి ప్రకటించింది.లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధి కోసం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.  ప్రతి ఏటా నోబెల్ పురస్కారాలను అందిస్తారు. పలు రంగాల్లో అత్యున్నతమైన నైపుణ్యాన్ని చూపిన వారికి  నోబెల్ పురస్కారాలను అందిస్తారు. 

వరుసగా పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారకి  ఈ పురస్కారాలను అందిస్తారు. బుధవారం నాడు రసాయన శాస్త్రంలో  విశేష ప్రతిభ కనబర్చిన  వారికి  నోబెల్ బహుమతులు అందిస్తారు.

 జాన్‌డెనఫ్ కు 97 ఏళ్ల వయస్సులో ఈ అవార్డు దక్కింది. రెండు రోజుల క్రితం ఫిజిక్స్ లో అత్యుత్తమైన ప్రతిభ కనబర్చిన వారికి నోబెల్ పురస్కారం దక్కింది. గురువారం నాడు ఇద్దరు సాహిత్యకారులకు నోబెల్ పురస్కారం దక్కనుంది. ఆ తర్వాత శుక్రవారం నాడు ఆర్దిక రంగంలో విశేష ప్రతిభ కనబర్చినవారికి అవార్డులు అందించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios