Asianet News TeluguAsianet News Telugu

మసూద్ అంతు తేల్చేందుకు... రంగంలోకి దిగిన అమెరికా

మసూద్ అంతు తేల్చేందుకు అమెరికా రంగంలోకి దిగింది. బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి మసూద్‌ను బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చేందుకు సరికొత్త తీర్మానాన్ని తయారు చేసి 15 సభ్యదేశాలకు కాపీలను అందజేసింది.

america steps up push to black list masood azhar at united states
Author
New York, First Published Mar 28, 2019, 2:54 PM IST

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజహర్‌ను బ్లాక్ లిస్ట్‌‌లో పెట్టేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పటి వరకు మూడు సార్లు అతనిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెట్టింది.

అయితే పాక్ చిరకాల మిత్రదేశం చైనా తన వీటో పవర్‌తో భారత ప్రయత్నాలను అడ్డుకుంది. సాంకేతిక కారణాలు చూపి తీర్మానాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మసూద్ అంతు తేల్చేందుకు అమెరికా రంగంలోకి దిగింది.

బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి మసూద్‌ను బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చేందుకు సరికొత్త తీర్మానాన్ని తయారు చేసి 15 సభ్యదేశాలకు కాపీలను అందజేసింది. మసూద్‌పై నిషేధం విధించాలని, ప్రయాణాలను నిషేధించాలని, ఆస్తులను స్తంభింపజేయాలని అమెరికా పేర్కొంది.

ఐసిస్, అల్‌ఖైదాతో అజార్‌కు సంబంధాలున్నాయని, ఆయా సంస్ధలకు ఆర్ధిక సాయం అందించడంతో పాటు ప్రణాళికలు రూపొందించడం, ఏర్పాట్లు చేయడం, మద్ధతు తెలపడం వంటివి చేశారని తెలిపింది. అమెరికా ఈసారి గట్టిగా పట్టుదలతో ఉండటంతో చైనా ఈసారి ఏం చేస్తుందో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios