Asianet News TeluguAsianet News Telugu

ఇండియా సర్జికల్ స్ట్రైక్స్: చైనా సలహ ఇదీ...

ఈ సమయంలో పాకిస్తాన్, ఇండియాలు నిగ్రహంగా ఉండాలని చైనా కోరింది. పాక్‌పై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్‌-2 కు పాల్పడిన తర్వాత తొలిసారిగా చైనా స్పందించింది.
 

Air strike on Balakot: China hopes India, Pakistan will show restraint
Author
Beijing, First Published Feb 26, 2019, 3:41 PM IST

బీజింగ్: ఈ సమయంలో పాకిస్తాన్, ఇండియాలు నిగ్రహంగా ఉండాలని చైనా కోరింది. పాక్‌పై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్‌-2 కు పాల్పడిన తర్వాత తొలిసారిగా చైనా స్పందించింది.

పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ పాల్పడిన విషయం తెలిసిందే.ఈ విషయమై మంగళవారం నాడు చైనా స్పందించింది. దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్ లు ముఖ్యమైన దేశాలని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది.

దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పేందుకు రెండు దేశాలు సహకరించాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ చెప్పారు.ఇవాళ ఆయన  బీజింగ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది నాన్ మిలటరీ స్ట్రైక్ గా అభివర్ణించారు.  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాద నిర్మూలన కోసం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీతో చైనా స్టేట్ కౌన్సిలర్ సోమవారం నాడు చర్చించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పాక్‌పై  ఇండియా సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడిన తర్వాత పాక్ విదేశాంగ శాఖ మంత్రి చైనా విదేశాంగ శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు.

Follow Us:
Download App:
  • android
  • ios